OTT: సంక్రాంతి స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ .. ఎక్కడ చూడొచ్చంటే?
సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో మసూద ఫేమ్ తిరువీర్ ప్రధాన పాత్ర పోషించాడు. ఓటీటీల్లో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
దేశవ్యాప్తంగా సంక్రాంతి పండగ ఘనంగా జరుపుకొంటున్నారు. ఇక పండగంటే పిండి వంటలతో పాటు కాలక్షేపానికి సినిమాలు కూడా ఉండాల్సిదే. ఇప్పటికే థియేటర్లలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు సందడి చేస్తున్నాయి. చాలామంది ఈ సినిమాలు చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే థియేటర్లకు వెళ్లలేని వారు ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూసేందుకు బోలెడు ఓటీటీలు ఉన్నాయి. సంక్రాంతి పండగ కాబట్టి కొత్త సినిమాలు, సిరీస్ లు కూడా వచ్చేశాయి. అలా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చింద. అదే మసూద ఫేమ్ తిరువీర్ నటించిన మోక్షపటం. రాహుల్ వనజ రాజేశ్వర్ తెరకెక్కించిన ఈ సినిమాలో రువీర్, పూజా కిరణ్, తరుణ్ పొనుగోటి, జెన్నిఫర్ ఇమ్మూన్యుయేల్, షాంతి రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా ఇప్పటివరకు థియేటర్లలో రిలీజ్ కాలేదు. దీంతో మంగళవారం (జనవరి 14) అర్ధరాత్రి నుంచే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ఆహా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ‘ఒక మిస్టరీ బ్యాగ్ గాయత్రి లైఫ్ ను ఛేంజ్ చేసింది. అది ఆమెకు అదృష్టం తెచ్చిపెట్టిందా? లేదా మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందా’? మోక్షపటం సినిమా స్ట్రీమింగ్ అవుతోంది’ అని ట్వీట్ చేసింది ఆహా.
. మోక్ష పటం సినిమాకు రవి గోలీ, లక్ష్మణా, రాహుల్ కథను అందించారు. నేస్తమా మూవీ మేకర్స్ పతాకంపై ప్రవీణ్ గడ్డం, సాయి, తారపరెడ్డి నిర్మించారు. కమ్రాన్ సంగీతం అందించారు. గోకుల్ భారతి, సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ చేశారు. ఇక నిన్ననే మోక్ష పటం సినిమా ట్రైలర్ ను కూడా షేర్ చేసింది ఆహా. ‘ఈ సస్పెన్స్ ఫుల్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మిమ్మల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఈ ట్విస్టులు, టర్నులను మిస్ అవొద్దు’ అని ట్వీట్ చేసింది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే కామెడీ తో పాటు థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉండనున్నాయని తెలుస్తోంది.
ఆహాలో స్ట్రీమింగ్..
A mysterious bag changes Gayatri’s life forever. Will it bring fortune or trouble?
Watch #Mokshapatam now!▶️https://t.co/xnqpEPAm3H#MokshapatamOnAha #Trailer #Comedy #Crime @iamThiruveeR @ShantiRaoDqd @pooja_kiran @JeniferEmmanu11 @hithisistarun @ursguruofficial @syedkamran… pic.twitter.com/LBiE7fjgqx
— ahavideoin (@ahavideoIN) January 14, 2025
మోక్షపటం సినిమా ట్రైలర్..
Watch the trailer of Mokshapatam, a suspenseful comedy-crime-thriller that will keep you on the edge of your seat! 😱 Don’t miss out on the twists and turns. #Mokshapatam Premiering January 14th, only on Aha #MokshapatamOnAha #Trailer #Comedy #Crime@iamThiruveeR… pic.twitter.com/hZjHrarZHA
— ahavideoin (@ahavideoIN) January 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.