AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day: త్రివర్ణ పతాకం చరిత్ర, ప్రాముఖ్యత, ఎగరవేయడంలో పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి..

1947 ఆగస్టు 15న బ్రిటీష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఈ రోజుకు గుర్తుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాలు తాకేలా జరుపుకుంటారు. భారతదేశ జాతీయ జెండా లేదా త్రివర్ణ పతాకం భారతీయులకు గర్వకారణం. ఐక్యతకు చిహ్నం. త్రివర్ణ పతాకం భారతదేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను సూచిస్తుంది. కనుక ఈ రోజు భారతీయులుగా మనం త్రివర్ణ పతాకం చరిత్ర, ప్రాముఖ్యతను గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Independence Day: త్రివర్ణ పతాకం చరిత్ర, ప్రాముఖ్యత, ఎగరవేయడంలో పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి..
Independence Day Flag
Surya Kala
|

Updated on: Aug 08, 2024 | 12:15 PM

Share

78వ స్వాతంత్ర్య దినోత్సవం 2024 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. దేశాన్ని బానిస సంకెళ్ల ను తెంచి స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగాన్ని చేసే వీరులను స్మరించుకునే రోజు స్వాతంత్ర దినోత్సవం. బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశానికి విముక్తి కల్పించడం కోసం 90 ఏళ్ల నిరంతర పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటీష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఈ రోజుకు గుర్తుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాలు తాకేలా జరుపుకుంటారు. భారతదేశ జాతీయ జెండా లేదా త్రివర్ణ పతాకం భారతీయులకు గర్వకారణం. ఐక్యతకు చిహ్నం. త్రివర్ణ పతాకం భారతదేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను సూచిస్తుంది. కనుక ఈ రోజు భారతీయులుగా మనం త్రివర్ణ పతాకం చరిత్ర, ప్రాముఖ్యతను గురించి ఈ రోజు తెలుసుకుందాం..

త్రివర్ణ పతాకం చరిత్ర, ప్రాముఖ్యత

ప్రపంచంలోని ప్రతి స్వతంత్ర దేశానికి దాని సొంత జెండా ఉంది. ఇది దేశ స్వాతంత్ర్యానికి చిహ్నం. భారతదేశం ప్రస్తుత రూపంలో ఉన్న జాతీయ జెండాను ఆగస్టు 15వ తేదీ 1947న బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందటానికి కొన్ని రోజుల ముందు అంటే జూలై 22, 1947న రాజ్యాంగ సభ ఆమోదించింది. 1916లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పింగళి వెంకయ్య అనే రచయిత ఖాదీ వస్త్రంతో తొలి జెండాను రూపొందించారు.

త్రివర్ణ జెండాలోని మూడు రంగులు దేనికి చిహ్నం అంటే ఏమిటంటే

జాతీయ జెండా త్రివర్ణ పతాకం మూడు రంగులను కలిగి ఉంటుంది. పైభాగంలో కాషాయపు రంగు, మధ్యలో తెలుపు, దిగువన ముదురు ఆకుపచ్చ రంగు. మధ్య భాగంలో 24 గీతలతో ఉన్న అశోక చక్రం ఉంది. జెండా వెడల్పు దాని పొడవుకు 2:3 నిష్పత్తిలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కాషాయపు రంగు: ఇది ధైర్యం, నిస్వార్థత, శక్తికి చిహ్నం.

తెలుపు రంగు: సత్యం, శాంతి, స్వచ్ఛతకు చిహ్నం. ఈ రంగు దేశంలో ఆనందం, శాంతి ప్రయోజనాన్ని చూపుతుంది.

ఆకుపచ్చ రంగు: శౌర్యం, పెరుగుదల, సంతానోత్పత్తికి చిహ్నం. శ్రేయస్సును కూడా సూచిస్తుంది.

భారత ప్రభుత్వం ప్రకారం జాతీయ జెండాను ఎగురవేసే సమయంలో చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఏమిటంటే

  1. జాతీయ జెండా ఎగురవేసినప్పుడు కాషాయ రంగు పైకి ఉండేలా చూసుకోవాలి.
  2. జాతీయ పతాకానికి సమానంగా కానీ అదే ఎత్తులో కానీ మరే ఏ ఇతర జెండా ఎగురకూడదు
  3. విద్యా సంస్థలలో (పాఠశాలలు, కళాశాలలు, క్రీడా శిబిరాలు, స్కౌట్ శిబిరాలు మొదలైనవి) త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా జాతీయ జెండాను గౌరవించడం.
  4. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ లేదా విద్యా సంస్థ సభ్యులు తగిన సందర్భాలలో జాతీయ జెండాను ఎగురవేయవచ్చు. ఉత్సవం లేదా జాతీయ జెండాకు గౌరవానికి అనుగుణంగా ఉండాలి.
  5. జాతీయ జెండాను మతపరమైన ప్రయోజనాల కోసం, లేదా ధరించే దుస్తులుగా ఉపయోగించకూడదు.
  6. వీలైనంత వరకు జాతీయ జెండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎగురవేయాలి.
  7. జాతీయ జెండా ఉద్దేశపూర్వకంగా నేల తాకరాదు లేదా నీటిలో ఉంచకూడదు. వాహనాలు, రైళ్లు, పడవలు లేదా విమానాల పైభాగంలో లేదా వెనుక భాగంలో ఎగర వేయరాదు.
  8. జాతీయ జెండాను అవమానపరిచే వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష. లేదా జరిమానా లేదా రెండింటితో కూడిన శిక్షలు వేయవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..