AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓవైపు కరోనా, మరోవైపు వైరల్ ఫీవర్స్‌.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ సర్కార్

ఓవైపు కరోనా, మరోవైపు వైరల్ ఫీవర్స్‌, పైగా వర్షాకాలం. గ్రామాలకు గ్రామాలే మంచానపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు...

Telangana: ఓవైపు కరోనా, మరోవైపు వైరల్ ఫీవర్స్‌.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ సర్కార్
Telangana Government
Ram Naramaneni
|

Updated on: Aug 25, 2021 | 8:02 AM

Share

ఓవైపు కరోనా, మరోవైపు వైరల్ ఫీవర్స్‌, పైగా వర్షాకాలం. గ్రామాలకు గ్రామాలే మంచానపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. గిరిజన గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ఏజెన్సీలోని చాలా గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గూడేలకు గూడాలే మంచానపడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రోగులతో ఆస్పత్రులన్నీ కిక్కరిసిపోతున్నాయి. వైరల్‌ ఫీవర్, కరోనాకు తేడా తెలియక చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై కీలక ఆదేశాలు జారీ చేసింది.

పలు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. విష జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రులకు వచ్చిన ప్రతీఒక్కరి అనుమానం పోయేలా వివరాలు చెప్పాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అలాగే అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టాలని ఆదేశించారు. ప్రధానంగా ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. దీనివల్ల కేవలం వైరల్‌ ఫీవర్ల నుంచే కాకుండా కరోనా నుంచి కూడా ప్రజలు రక్షణ పొందుతారని వివరించారు. ఇప్పటికే గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేశామని, వీటి వినియోగం పైనా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు కచ్చితంగా పారిశుద్ధ్య పనులును పరిశీలించాలని, తమతమ గ్రామాల ప్రజలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విషజ్వరాలపై నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోనూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Also Read:అమెరికాలో అత్యంత పొడవైన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్స్‌కి ఎక్కిన ఇగోర్ మృతి

 ఈ రాశివారికి ప్రమోషన్లు లేదా ట్రాన్స్‌ఫర్‌లు.. వ్యాపారులకు లాభాలు..