AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yellandu Politics: ఇల్లందు ఇంటి పోరు ఇంతింత కాదయా.. సార్ జర పట్టించుకోండి!

తెలంగాణ అసెంబ్లీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత్ రాష్ట్ర సమితిలో అసమ్మతి రాగం రాజుకుంటోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కన్‌ఫామ్ చేసి ప్రచారంలో దూసుకుపోతోంది అధికార బీఆర్ఎస్ పార్టీ. గత ఎన్నికల్లోనూ, ఈసారి కూడా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ మనుగడ కోసం అసమ్మతి రాగం అలపిస్తున్నారు.

Yellandu Politics: ఇల్లందు ఇంటి పోరు ఇంతింత కాదయా.. సార్ జర పట్టించుకోండి!
Yellandu mla
N Narayana Rao
| Edited By: |

Updated on: Oct 12, 2023 | 5:26 PM

Share

తెలంగాణ అసెంబ్లీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత్ రాష్ట్ర సమితిలో అసమ్మతి రాగం రాజుకుంటోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కన్‌ఫామ్ చేసి ప్రచారంలో దూసుకుపోతోంది అధికార బీఆర్ఎస్ పార్టీ. గత ఎన్నికల్లోనూ, ఈసారి కూడా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ మనుగడ కోసం అసమ్మతి రాగం అలపిస్తున్నారు. ఒకవైపు పార్టీ అగ్రనేతల బుజ్జగింపులు, హామీలు, ప్రలోభాలతో సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇల్లందు ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలంటూ కార్యకర్తలే గళం విప్పితున్నారు.

ఇల్లందు బీఆర్ఎస్‌లో అసమ్మతి తారా స్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ ఇవ్వవద్దంటూ అసమ్మతి వర్గం డిమాండ్ చేస్తోంది. ఇతర నేతల్లో ఎవరికి ఇచ్చినా గెలుపించుకుంటామంటూ పట్టుపడుతున్నారు. అయితే ఇప్పటికే అనేకసార్లు పార్టీ నేతలతో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యి.. బుజ్జగించినా వెనక్కి తగ్గడంలేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వరుస సమావేశాలు నిర్వహిస్తూ కాక పుట్టిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చక పోతే సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో ఇల్లందు బీఆర్ఎస్‌లో పరిణామాలు హీట్ పుట్టిస్తున్నాయి.

ఇల్లందు బీఆర్ఎస్ నేతల్లో గతం నుంచే సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియను వ్యతిరేకిస్తున్నారు. ఆమెకు టికెట్ ఇవ్వవద్దని చివరి వరకు ప్రయత్నం చేశారు అసమ్మతి నేతలు. కానీ.. అధిష్ఠానం ఈ సారి కూడా ఆమెను ఫైనల్ చేసి అభ్యర్థిగా ప్రకటించడంతో అసమ్మతి వర్గం భగ్గుమంటుంది. పార్టీకి నష్టం కలిగించి.. కేడర్‌ను, పార్టీ నేతల్ని ఇబ్బందులు పెట్టిన ఎమ్మెల్యేకు మళ్ళీ ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు అసమ్మతి నేతలు. అంతేకాదు గత కొద్దిరోజులుగా..నియోజక వర్గంలో జరుగుతున్న కార్యక్రమాలకు గానీ, పార్టీ ఎన్నికల ప్రచారానికి గానీ దూరంగా ఉంటున్నారు.

పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పార్లమెంటు సభ్యులు గాయత్రి రవి, జిల్లా నేతలు అసమ్మతి వర్గంతో భేటీ అయ్యి.. బుజ్జగించినా ఎలాంటి ఫలితం ఇవ్వడంలేదు. ససేమిరా అంటున్నారు అసమ్మతి నేతలు. దీనితో ఈ పంచాయితీ కాస్తా మంత్రి హరీష్ రావు వద్దకు వెళ్ళింది. అసమ్మతి వర్గం నేతలు, జిల్లా నేతలు, ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో వారిని బుజ్జగింపులు జరిగాయి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని.. సీఎం కేసీఆర్ దృష్టికి అన్ని సమస్యలు తీసుకువెళ్తనని హరీష్ రావు నచ్చజెప్పారు. తిరిగి నియోజక వర్గానికి వచ్చిన..అసమ్మతి వర్గం.. మళ్ళీ ఎమ్మెల్యే కాదని పర్యటిస్తూ.. వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అధిష్ఠానం తమ సూచనను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేకు సహకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

దీంతో నియోజక వర్గంలో ఎమ్మెల్యే అనుకూల వర్గం, వ్యతిరేకవర్గంగా విడిపోయారు బీఆర్ఎస్ నేతలు. ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసలు ఏమి జరుగుతుందో అర్థం కాక కేడర్ గందరగోళానికి గురవుతున్నారు. ప్రచారంలో ముందుకు వెళ్ళే పరిస్థితి లేక.. వీరిని బుజ్జగించలేక.. నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ లోపు సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు బి ఫాం లు ఇవ్వబోతున్న నేపథ్యంలో సిట్టింగ్‌కు టికెట్ ఇవ్వవద్దని.. అఖరి నిమిషం వరకు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ వెళ్లి అక్కడే మకాం వేశారు అసమ్మతి నేతలు. ఏదో ఒకటి తేల్చుకుని వస్తామంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే.. తాము సంచలన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. చివరికి..ఇల్లందు బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..