Coldrif Cough Syrup: పసిపిల్లల ప్రాణం తీస్తున్న దగ్గుమందుపై తెలంగాణ ఉక్కుపాదం.. రాష్ట్రంలో అమ్మకాల నిలిపివేత
దేశంలోని మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో చిన్నారుల వరుస మరణాలకు కారణమవుతున్న కోల్డ్రిఫ్ దగ్గు మందుపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝులిపించింది. రాష్ట్రంలో ఇకపై ఈ కోల్డ్రిఫ్ సిరప్ వాడకంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానున్నట్టు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అభంశుభం తెలియని చిన్నారుల వరుస మరణాలకు కారణం అవుతున్న దగ్గు మందుపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝులిపించింది. రాష్ట్రంలోనూ ఇకపై కోల్డ్రిఫ్ సిరప్ వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కోల్డ్రిఫ్ సిరప్ తాగడం వల్ల చిన్నారులు చనిపోవడంతో, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.
తమిళనాడు రాష్ట్రంలోని sresan ఫార్మా కంపెనీ తయారు చేసిన ఈ కోల్డ్రిఫ్ సిరప్ తాగడం వల్ల రాజస్ధాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చిన్నారుల పాలిట ప్రాణాపాయంగా పరిణమించిన ఈ దగ్గుమందును ఇకపై రాష్ట్ర ప్రజలు వాడొద్దని.. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.

Coldrif Cough Syrup
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




