AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nalgonda: బాబోయ్.. ఈ దొంగలు మహా ముదురు! దొంగతనాలను పట్టించే సీసీ కెమెరాలపైనే కన్నేశారు

సాధారణంగా దొంగలు దొంగతనానికి వస్తే.. ఇళ్లలోని డబ్బు, బంగారం, వెండి లేదంటే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఎత్తుకుపోతారు. అదీ కాదంటే..ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్ లు, కార్లను మాయం చేస్తుంటారు. కానీ.. ఇక్కడి దొంగలు మాత్రం విలువైన వస్తువులను వదిలేసి.. విచిత్రమైన దొంగ తనాలకు పాల్పడుతున్నారు. ఆ విచిత్ర దొంగతనాలు ఏంటి..? దొంగలు ఎత్తుకెళ్తున్న వస్తువులు ఏంటి..?..

Nalgonda: బాబోయ్.. ఈ దొంగలు మహా ముదురు! దొంగతనాలను పట్టించే సీసీ కెమెరాలపైనే కన్నేశారు
Thieves stealing CCTV cameras from houses
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 21, 2023 | 10:36 AM

Share

నల్గొండ, సెప్టెంబర్ 21: సాధారణంగా దొంగలు దొంగతనానికి వస్తే.. ఇళ్లలోని డబ్బు, బంగారం, వెండి లేదంటే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఎత్తుకుపోతారు. అదీ కాదంటే..ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్ లు, కార్లను మాయం చేస్తుంటారు. కానీ.. ఇక్కడి దొంగలు మాత్రం విలువైన వస్తువులను వదిలేసి.. విచిత్రమైన దొంగ తనాలకు పాల్పడుతున్నారు. ఆ విచిత్ర దొంగతనాలు ఏంటి..? దొంగలు ఎత్తుకెళ్తున్న వస్తువులు ఏంటి..? తెలుసు కోవాలంటే…

ఇళ్లలో దొంగతనం జరగకుండా ఇంటి గేట్లకు తాళాలు వేస్తుంటాం. దొంగతనాలు జరిగినా.. దొంగలను పట్టుకునేందుకు ఇళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటాం. దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు పదే పదే చెబుతుంటారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా దొంగతనాలకు బ్రేక్ పడడం లేదు. ఇటీవల నల్గొండ పట్టణంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఇళ్లలో చొరబడి బంగారమో, డబ్బో, బైకులు, కార్లను దొంగతనం చేయడం లేదు. తాము చేసే దొంగతనాల బండారాన్ని బయట పెట్టి, పోలీసులకు పట్టిస్తున్న సీసీ కెమెరాలపై కన్నేశారు. తమను పట్టిస్తున్నాయన్న కోపమో.. లేదా ఇంకేదైననా కారణం ఉందో కానీ దొంగలు.. ఇళ్లలో విలువైన వస్తువులను వదిలేసి కేవలం ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను మాత్రమే ఎత్తుకెళ్తున్నారు.

నల్గొండ పట్టణంలో అర్థరాత్రి సమయంలో దొంగలు రెచ్చిపోతున్నారు. శ్రీనగర్ కాలనీలోని ఇళ్లకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మాయం చేశారు. తన ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు తెల్లవారే సరికి మాయం కావడంతో యాజమాని కంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. వారం రోజుల్లో శ్రీనగర్ కాలనీలో మూడు ఇళ్లల్లోని సీసీ కెమెరాలు మాయం కావడంతో కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విచిత్ర దొంగతనాలతో పోలీసులు అవాక్కయ్యారు. అయితే.. ఈ దొంగతనాలకు సంబధించిన దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా.. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దోపిడీలు, దొంగతనాల కేసుల్లో కీలకంగా భావించే సీసీటివిలను దొంగలు ఎత్తు కెళ్తుండడంతో.. ఇవేం దొంగతనాలు రా బాబూ అంటూ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.