AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వెలుగులోకి 1300 ఏళ్ల పురాతన మెట్ల బావి, 1200 ఏళ్ల నాటి గణపతి విగ్రహం.. ఎక్కడో తెలుసా?

శిల్పకళా వైభవానికి పెట్టింది పేరు.. కాకతీయుల పాలన. కాకతీయుల చరిత్రలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. నేటికీ ఆ ప్రాంతాలు చరిత్రకు సజీవ సాక్షాలుగా ఉన్నాయి. కానీ, నాటి కాలంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న కట్టడాలు అక్కడక్కడ నేటికీ దర్శన మిస్తుంటాయి. ఆ కాలంలో కాకతీయులు వారి అవసరాల కోసం చెరువులు, నీటి బావిలను నిర్మించుకున్నారు...

Telangana: వెలుగులోకి 1300 ఏళ్ల పురాతన మెట్ల బావి, 1200 ఏళ్ల నాటి గణపతి విగ్రహం.. ఎక్కడో తెలుసా?
Suryapet
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 21, 2023 | 9:19 AM

Share

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మెట్లబావులు దర్శనమిస్తుంటాయి. అయితే కొన్నింటికి మాత్రం చాలా చరిత్ర ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట పేరు చెప్పగానే నిజాం నిరంకుశ పాలనలో జరిగిన మారణ హోమం తోపాటు వీర తెలంగాణ సాయుధ పోరాటం అందరికీ గుర్తుకొస్తుంది. అంతకు పూర్వం కాకతీయుల కాలంలో నిర్మించిన కట్టడాలు, ఆలయాలు, బావులు దర్శనమిస్తుంటాయి. తాజాగా సూర్యాపేట ప్రాంతంలో 1300 ఏళ్లనాటి మెట్ల బావి,120 ఏళ్ల క్రితం నాటి గణపతి విగ్రహం వెలుగు చూశాయి.

శిల్పకళా వైభవానికి పెట్టింది పేరు.. కాకతీయుల పాలన. కాకతీయుల చరిత్రలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. నేటికీ ఆ ప్రాంతాలు చరిత్రకు సజీవ సాక్షాలుగా ఉన్నాయి. కానీ, నాటి కాలంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న కట్టడాలు అక్కడక్కడ నేటికీ దర్శనమిస్తుంటాయి. ఆ కాలంలో కాకతీయులు వారి అవసరాల కోసం చెరువులు, నీటి బావిలను నిర్మించుకున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో ప్రావస్థ శాఖ అధికారులు జరిపిన పరిశోధనలో ఇలాంటి మెట్లబావి బయట పడింది. పురాతన చెన్నకేశవ చెన్నకేశవ స్వామి ఆలయంలో లోపల నలువైపులా నిర్మాణాలను పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు.

ఇది అపురూపమైన చారిత్రక ఆలయంగా పేర్కొన్నారు. ఆలయంలో కొలువై ఉన్న చెన్నకేశవ స్వామి విగ్రహం క్రీస్తు శకం 16వ శతాబ్దం నాటిదని, మహామండపంలో ఇరువైపులా ఉన్న అల్వార్ విగ్రహాలు18వ శతాబ్దం నాటివని తేల్చారు. ఆలయంలో రాతి స్తంభాలతో ఉన్న ముఖ మండపం కూడా 18 శతాబ్దం నాటిదని చెప్పారు.18 వ శతాబ్దంలో నిర్మించిన మెట్ల భావికి 13 శతాబ్దం నాటి కాకతీయ స్థంబాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. స్తంభాలపై ఉన్న శృంగారపు శిల్పాలు చరిత్రను ధృవీకరిస్తున్నాయని తెలిపారు. నిర్మాణం జరుపుకొని 300 సంవత్సరాలు కావడంతో శిధిలావస్థకు చేరిన మెట్ల వరుసలు వంకరులు తిరిగి , కొన్నిచోట్ల భూమిలోకి కుంగిపోయినట్లుగా ఉన్నాయి. మెట్ల బావికి పక్కనే ఉన్న సత్రపు మండపం కూడా అక్కడక్కడ కుంగుబాటుకు గురైంది. ఈ మెట్లబావి ఎంతో పురాతమైనదిగా పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు.

అబ్బురపరిచే 1200 ఏళ్ల క్రితం నాటి గణపతి విగ్రహం..

ఆత్మకూరు గ్రామంలో పురావస్తు శాఖ అధికారులు జరిపినన అన్వేషణలో అతి పురాతన కాలంనాటి గణపతి విగ్రహాన్ని పరిశీలించారు. ఈ గణపతి విగ్రహం ఎనిమిదవ శతాబ్దం నాటిదిగా గుర్తించారు. 120 సంవత్సరాల చరిత్ర ఈ విగ్రహానికి ఉందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. చాళుక్య రాజుల కాలంలో నల్లశానపు రాతిలో చెక్కిన రెండు చేతులు కలిగిన, తలపై కిరీటంలేని విగ్రహంగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. గ్రామానికి చెందిన దొరవారి బావిలో నలభై ఏళ్ల క్రితం బావి పూడిక తీత సందర్భంగా ఈ భారీ విగ్రహం దొరికిందని గ్రామసలు చెబుతున్నారు.

Suryapet Atmakur

అప్పట్నుంచి స్థానిక యువకులు వినాయక చవితి ఉత్సవాలకు గణపతి విగ్రహాన్ని ముస్తాబు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులు, పురావస్తు పరిశోధకుడు ఈమని శివ నాగిరెడ్డితో కలిసి మెట్ల బావితో పాటు చెన్నకేశవ ఆలయాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి సందర్శించారు. మెట్ల బావికి పూర్వ వైభవానికి బావిని పునరుద్ధరించడానికి మంత్రి జగదీశ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే పూడికతీత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. చారిత్రక గణపతి విగ్రహం రోడ్డుకు మూడు అడుగుల లోతులో ఉన్న వినాయక విగ్రహాన్ని పనరుద్ధరణ చర్యలో భాగంగా ఎత్తు ప్రదేశంలో ప్రతిష్ఠించనున్నట్లు మంత్రి వెల్లడించారు. నియోజకవర్గంలోని వారసత్వ ప్రదేశాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటానని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..