AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రజావాణి కార్యక్రమంలో వినతి! కానిస్టేబుల్‌ భార్యకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం

ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం లభించింది. స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించగా.. నూతనంగా తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిబంధనలు సడలించి కానిస్టేబుల్‌ భార్యకు ఉద్యోగం కల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చొరవతో తనక ఉద్యోగం లభించిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు..

Telangana: ప్రజావాణి కార్యక్రమంలో వినతి! కానిస్టేబుల్‌ భార్యకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం
Constable's Wife Got A Job In Rachakonda Commissionerate
Srilakshmi C
|

Updated on: Jan 09, 2024 | 4:03 PM

Share

హైదరాబాద్, జనవరి 9: ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం లభించింది. స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించగా.. నూతనంగా తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిబంధనలు సడలించి కానిస్టేబుల్‌ భార్యకు ఉద్యోగం కల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చొరవతో తనక ఉద్యోగం లభించిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. వివరాల్లోకెళ్తే..

రాచకొండ పోలీసు కమిషనరేట్ అంబర్ పేట పోలీసు హెడ్ హెడ్ క్వార్టర్స్‌లో సొంగా శేఖర్ విధులు నిర్వర్తిస్తూ 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అతని భార్య సత్యలత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందడంతో స్థానికత కారణం చూపుతూ రెండేళ్లుగా ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి గత ప్రభుత్వం నిరాకరించింది. బాధితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ కుటుంబ దీనస్థితిని తెలియజేశారు. సత్వరమే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌ మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని రాష్ర్ట డీజీపీ, రాచకొండ సి‌పి లకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వవలసినదిగా రాచకొండ సీపీకి డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాచకొండ సీపీ రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ సత్యలతకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంలో సమర్దవంతంగా నీతి, నిజాయితీతో పనిచేయాలని, భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని కమిషనర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌, డీజీపీ, రాచకొండ సీపీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రా రెడ్డి, దివంగత కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.