Telangana: బెంగళూరు రోడ్డు ప్రమాదం.. నారాయణపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడు తెలంగాణ రాష్ట్రం నారాయణపేటు చెందిన వాసుదేవ్ ఆచారి(26)గా పోలీసులు గుర్తించారు. పుట్టిన రోజునాడు దైవదర్శనం చేసుకునేందుకు బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృత్యువు కాటేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నారాయణపేట, జనవరి 9: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడు తెలంగాణ రాష్ట్రం నారాయణపేటు చెందిన వాసుదేవ్ ఆచారి(26)గా పోలీసులు గుర్తించారు. పుట్టిన రోజునాడు దైవదర్శనం చేసుకునేందుకు బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృత్యువు కాటేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తెలంగాణలోని నారాయణపేటకు చెందిన పద్మాక్షి, శ్రీనివాస్ ఆచారి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు చారుకేశా చారి, చిన్న కుమారుడు వాసుదేవ ఆచారి. తల్లి విశ్రాంత ఉపాధ్యాయురాలు. చిన్న కుమారుడైన వాసుదేవ ఆచారి చిన్నప్పటి నుంచే చదువులో రానించేవాడు. పదోతరగతిలో మంచి ప్రతిభ కనబరిచాడు. వీరి కుటుంబం హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. టెన్త్ పూర్తైన తర్వాత హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో చేర్పించారు. ఇంటర్‌లో 470 మార్కులకుగాను 466 మార్కులు సాధించి రాష్ట్ర ర్యాంకు సాధించాడు. బిట్స్ పిలానిలోనూ ర్యాంకు సాధించగా వరంగల్ ఎన్‌ఐటీలో చేరాడు. ఏడాదిన్నర కిందట బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీతో రూ.38 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగంలో చేరాడు. స్నేహితులతో కలిసి బెంగళూరులోనే ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే సోమవారం వాసుదేవ ఆచారి పుట్టినరోజు కావడంతో.. ఆ రోజు ఉదయం స్నేహితుడితో కలిసి బెంగళూరులోని నందిహిల్స్‌లోని దేవాలయానికి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గం మధ్యలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాసుదేవ ఆచారి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్రంగా గాయపడిన స్నేహితుడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అతడికి ప్రమాదం తప్పింది. పుట్టిన రోజు నాడే కుమారుడిని మృత్యువు కాటేయడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.