Sabarimala: శబరిమలలో దారుణం.. 18 మెట్లు ఎక్కుతుండగా అయ్యప్ప భక్తుడిపై ఖాకీల పిడిగుద్దులు

భక్తుల దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా మంది క్యూలో అయ్యప్ప దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.. అయితే మండల దీక్ష తీసుకున్న భక్తులు శాస్తా దర్శనం కోసం 'పతినెట్టంపాడి' (18 మెట్లు) ఎక్కాల్సి ఉంటుంది. ఇలా అయ్యప్ప ఆలయం వద్ద 'పతినెట్టంపాడి' (18 పవిత్ర మెట్లు) ఎక్కుతుండగా ఓ పోలీసు తనని కొట్టాడని బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు.

Sabarimala: శబరిమలలో దారుణం.. 18 మెట్లు ఎక్కుతుండగా అయ్యప్ప భక్తుడిపై ఖాకీల పిడిగుద్దులు
Kerala Rush
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2024 | 4:12 PM

కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమల. ఈ క్షేత్రంలో కొలువైన హరిహరసుతుడు అయ్యప్ప దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. దీక్ష తీసుకున్న భక్తులు నియమనిష్టలతో అయ్యప్పను పూజించి శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్తారు. ఏటేటా శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. ఈ ఏడాది అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో దర్శన సమయాలను గంటపాటు పెంచుతూ ట్రావెన్‌కోర్ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ భక్తుల దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా మంది క్యూలో అయ్యప్ప దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.. అయితే మండల దీక్ష తీసుకున్న భక్తులు శాస్తా దర్శనం కోసం ‘పతినెట్టంపాడి’ (18 మెట్లు) ఎక్కాల్సి ఉంటుంది. ఇలా అయ్యప్ప ఆలయం వద్ద ‘పతినెట్టంపాడి’ (18 పవిత్ర మెట్లు) ఎక్కుతుండగా ఓ పోలీసు తనని కొట్టాడని బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే..

బెంగళూరుకి చెందిన ఎస్ రాజేష్ (30) అనే భక్తుడు శబరిమల అయ్యప్ప సన్నిధానం కు చేరుకున్నాడు. ఆదివారం సాయంత్రం 4.30 నుంచి 5 గంటల మధ్య శాస్తా దర్శనం కోసం 18 మెట్లు ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రాజేష్‌ను సన్నిధానం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.

ఈ విషయంపై రాజేష్ స్వామి స్పందిస్తూ.. 22 మంది సభ్యుల బృందంతో కలిసి శబరిమల చేరుకున్నామని చెప్పారు. తమ బృందం పతినెట్టంపాడి చేరుకుంది. ఆ సమయంలో మరో జట్టు సభ్యుడు మురళి కొడుకు ఆరేళ్ల బాలుడు తనతో ఉన్నాడని రాజేష్ చెప్పాడు.. తాను ఆ బాలుడితో కలిసి మెట్లు ఎక్కుతున్నట్లు.. ఆ సమయంలో మెట్లను నెమ్మదిగా ఎక్కుతున్నామని… అది చూసిన పోలీసు.. తను నాలుగో మెట్టుకి రాగానే వీపుపై చేతితో కొట్టాడని వెల్లడించాడు. అప్పుడు తాను నొప్పితో కేకలు వేస్తూనే పిల్లవాడిని మరింత దగ్గరకు తీసుకుని వేగంగా మెట్లు ఎక్కడానికి ప్రయత్నించినట్లు.. అయినా సరే పోలీసు ఆగకుండా మరో నాలుగు సార్లు వీపు మీద కొట్టినట్లు చెప్పాడు. తన వీపుపై పోలీసు గోళ్ల గుర్తులున్నాయి .. అని అన్నాడు రాజేష్.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన వివాదానికి దారి తీసింది. వెంటనే స్పందించిన ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు (టిడిబి) సభ్యుడు ఎ అజికుమార్ సన్నిధానంలో పోలీసు స్పెషల్ ఆఫీసర్ ఆర్ ఆనంద్‌ను వ్యక్తిగతంగా కలిసి.. సదరు పోలీసుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విచారణ జరుపుతారని స్పెషల్ ఆఫీసర్ టీడీబీ సభ్యుడికి తెలిపారు. దేవస్వం మంత్రి కె. రాధాకృష్ణన్ కూడా ఘటన గురించి తెలుసుకుని శబరిమల అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) సూరజ్ షాజీని కలిసి వివరాలు కోరారు. యాత్రికుడు ఫిర్యాదు చేసినట్లు ఏడీఎం మంత్రికి తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..