లక్షద్వీప్‌లోని విమానం దిగే సమయంలో పైలెట్లకు టెన్షన్.. ప్రయాణీకులకు స్వర్గంలో అడుగు పెడుతున్నామనే అనుభూతి.. వీడియో వైరల్

చాలా మంది ప్రజలు లక్షద్వీప అందాలను మెచ్చుకుంటున్నారు. రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ.. సెలవులు గడపడానికి మాల్దీవుల కంటే ఈ ప్రదేశం మంచి ప్రదేశం అని పేర్కొన్నారు. అంతేకాదు ఈ అందాల దీపానికి సంబంధించిన ఫొటోలతో పాటు.. రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి వీడియోల్లో ఒకటి ఆ దీపంలో విమానం అడుగు పెడుతున్న దృశ్యం. లక్షద్వీప్‌లో ఒకే ఒక విమానాశ్రయం ఉంది.

లక్షద్వీప్‌లోని విమానం దిగే సమయంలో పైలెట్లకు టెన్షన్.. ప్రయాణీకులకు స్వర్గంలో అడుగు పెడుతున్నామనే అనుభూతి.. వీడియో వైరల్
Plane Landing On Lakshadwee
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2024 | 5:33 PM

గూగుల్ లో అత్యధికంగా వెదుకుతున్న పదం లక్షద్వీపం.. అవును మోడీ పర్యటన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా భారత్‌లోని లక్షద్వీపంపై చర్చ జరుగుతోంది. అవును ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఈ అద్భుతమైన.. అందమైన ద్వీపసమూహాన్ని సందర్శించారు. మోడీ సందర్శన అనంతరం లక్షద్వీపానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా మంది ప్రజలు లక్షద్వీప అందాలను మెచ్చుకుంటున్నారు. రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ.. సెలవులు గడపడానికి మాల్దీవుల కంటే ఈ ప్రదేశం మంచి ప్రదేశం అని పేర్కొన్నారు. అంతేకాదు ఈ అందాల దీపానికి సంబంధించిన ఫొటోలతో పాటు.. రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి వీడియోల్లో ఒకటి ఆ దీపంలో విమానం అడుగు పెడుతున్న దృశ్యం. లక్షద్వీప్‌లో ఒకే ఒక విమానాశ్రయం ఉంది. ఇక్కడ విమానం దింపే సముయంలో కొన్నిసార్లు పైలట్‌లకు శ్వాస కూడా నిలిచిపోయేంత ప్రమాదకరమైనదని మీకు తెలుసా..!

లక్షద్వీపంలోని ఏకైక విమానాశ్రయం అగతి ద్వీపంలో ఉంది. దీనిని అగతి విమానాశ్రయంగా పిలుస్తారు. ఈ విమానాశ్రయం పొడవు 1204 మీటర్లు .. వెడల్పు 30 మీటర్లు మాత్రమే.. చుట్టూ సముద్రపు నీరు మాత్రమే ఉంటుంది. విమానాన్ని ల్యాండింగ్ చేసేటప్పుడు లేదా టేకాఫ్ చేసేటప్పుడు పైలట్ల టెన్షన్ తో తమ శ్వాసను బిగబట్టి ఉండడానికి కారణం ఇదే. ఈ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విమానాశ్రయం ఆకాశం నుంచి వీక్షణ ఎంత అందంగా ఉందో వీడియోలో మీరు చూడవచ్చు. విమానం దిగుతుంటే స్వర్గంలోకి దిగుతున్నట్లు అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

విమానం ల్యాండింగ్‌కు సంబంధించిన ఈ వీడియో @RaushanRRajputఅనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. కేవలం 27 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 7.5 మిలియన్లు అంటే 75 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ ను, 98 వేలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకున్నారు.

అదే సమయంలో వీడియోను చూసిన తర్వాత నేతిజనలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒక పాకిస్తాన్ కు చెందిన వ్యక్తీ స్పందిస్తూ.. ‘ఈ ప్రదేశం స్వర్గం. దీన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చాలా మంచి పని చేస్తోంది’ అని కామెంట్ చేయగా.. మరొకరు ఈ విమానాశ్రయాన్ని వీలైనంత త్వరగా ప్రపంచ స్థాయి విమానాశ్రయంగా మార్చాలని సూచిస్తున్నారు.

మరిన్ని  ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..