Lakshadweep: జాక్ పాట్ కొట్టిన లక్షద్వీప్.. షేక్ అయిన గూగుల్
హమారా భారత్, హమారా లక్షద్వీప్.. ఈ మాటలు పలుకుతున్నప్పుడు గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. నా దేశం.. నా పర్యాటకం.. నేను నా దేశంలో ఉన్న ప్రాంతాలన్నీ పర్యటిస్తాను. నా పర్యాటక రంగాన్ని ఉన్నత స్థితిలో నిలబెడతాను అని అనుకున్నప్పుడు మనసు సంతోషంతో పులకించిపోతుంది. కానీ ఇలాంటి సందర్భం అరుదుగా వస్తుంది. మాల్దీవుల మంత్రుల నోటి దురుసు వల్ల.. టూరిజం విషయంలో ఇండియన్స్ అంతా ఒక్క తాటిపైకి వచ్చారు.
హమారా భారత్, హమారా లక్షద్వీప్.. ఈ మాటలు పలుకుతున్నప్పుడు గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. నా దేశం.. నా పర్యాటకం.. నేను నా దేశంలో ఉన్న ప్రాంతాలన్నీ పర్యటిస్తాను. నా పర్యాటక రంగాన్ని ఉన్నత స్థితిలో నిలబెడతాను అని అనుకున్నప్పుడు మనసు సంతోషంతో పులకించిపోతుంది. కానీ ఇలాంటి సందర్భం అరుదుగా వస్తుంది. మాల్దీవుల మంత్రుల నోటి దురుసు వల్ల.. టూరిజం విషయంలో ఇండియన్స్ అంతా ఒక్క తాటిపైకి వచ్చారు. ఒకే మాట మీద ఉన్నారు. ఖబర్దార్.. మా జోలికొస్తే.. మావాళ్లు మీ దేశం దిక్కే చూడరు.. కనీసం గూగుల్ లో కూడా వెదకరు. అంతెందుకు.. అసలు వరల్డ్ టూరిజం ప్లాన్ లో అదో దేశం ఉందని కూడా మర్చిపోతారు. జాగ్రత్త.. అంటూ చిన్న పెద్దా… పేద-గొప్పా.. అంతా ముక్తకంఠంతో చెప్పేసరికీ.. ఆ సౌండ్.. మాల్దీవుల్లో రీసౌండ్ గా వినిపించి ఉంటుంది. లక్షద్వీప్ లో మోదీ పర్యటన తరువాత.. ఓ ఆన్ లైన్ ట్రావెల్ సంస్థ వెబ్ సైట్ లో ఆ ప్రాంతం గురించి వెదికినవారి శాతం ఎంత పెరిగిందో తెలుసా? 3400 శాతం. ఈ నెంబర్ చూస్తే.. ఆ పిచ్చి కామెంట్లు చేసి సస్పెండ్ అయిన మాల్దీవుల మంత్రుల కళ్లు తిరుగుతాయేమో! ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. లక్షద్వీప్ సెర్చింగ్ తో ఇప్పుడు టూరిజాన్ని ప్లాన్ చేసే సంస్థలు.. మన దేశంలో బీచెస్ ఆఫ్ ఇండియా పేరుతో కొత్త ప్రోగ్రామ్ ను డిజైన్ చేయడానికి చూస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Janhvi Kapoor: తారక్ టేప్ రికార్డర్ అని పేరు పెట్టాడు
ఎన్టీఆర్ గురించి జాన్వీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పక్కా.. అల్లరే అల్లరి
ఏందో ఏమో.. చిత్రవిచిత్రంగా హీరో కూతురి పెళ్లి
Sabarimala: అయ్యప్ప స్వాములకు అలెర్ట్ !! మకరజ్యోతి దర్శనం వారికీ మాత్రమే