Viral Video: రోడ్డు మీద చెత్త పడేసిన ‘కారు’గాళ్లకు దిమ్మతిరిగే షాక్.. 4 కి.మి. వెంటాడి మరీ లెఫ్ట్ & రైట్ ఇచ్చిన యువకుడు

బహిరంగ ప్రదేశాల్లో ఇలా చెత్త వేయడం తప్పని తెలిసినా.. తమ తీరుని మార్చుకోరు. తిన్నతర్వాత ప్లాస్టిక్ బాక్సులు, వాటర్ బాటిల్ అయినా, స్నాక్స్ ప్యాకెట్లైనా.. ఇలా ఎటువంటి చెత్తనైనా సరే డస్ట్ బిన్ లో వేయరు. ఎంత నిర్లక్ష్యం అంటే డస్ట్ బిన్ తమకు అందుబాటులో ఉన్నా దాని పక్కనే చెత్తను వేసే గొప్పవారు కూడా ఉన్నారు. ఇలాంటి ఘటన ఒక రోడ్డుమీద జరిగే అది చూసిన ఓ యువకుడు ఆ పర్యాటకులకు చెప్పిన బుద్దికి సంబంధించిన ఓ వీడియో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మహారాష్ట్ర నుంచి కొడగుకు వచ్చిన పర్యాటకులు కారులో ప్రయాణిస్తూ.. తాము తిన్న చిరుతిళ్ల ప్యాకెట్ల వంటి చెత్తను రోడ్డుపై విసిరి వేశారు.

Viral Video: రోడ్డు మీద చెత్త పడేసిన 'కారు'గాళ్లకు దిమ్మతిరిగే షాక్..  4 కి.మి. వెంటాడి మరీ లెఫ్ట్ & రైట్ ఇచ్చిన యువకుడు
Viral Video
Follow us

|

Updated on: Jan 07, 2024 | 12:54 PM

పచ్చదనం పరిశుభ్రత గురించి ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలా మందిలో నిర్లక్ష్యమే.. ఈ విషయంలో చదువుకున్న వారు కూడా మిహనయింపు కాదనే సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇంటిలోని చెత్త ను వీధిలో వేసేవారు కొందరు అయితే.. తమది కాని ప్రాంతాల్లో వేసేవారు కూడా ఉన్నారు. అదే విధంగా పర్యాటక కేంద్రాలకు వెళ్ళేవారు వారు అక్కడ ప్రాంతాల్లో మాత్రమే కాదు.. అలా వెళ్లే సమయంలో రహదారులపై కూడా పర్యాటకులు చెత్తను వేస్తుంటారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చెత్త వేయడం తప్పని తెలిసినా.. తమ తీరుని మార్చుకోరు. తిన్నతర్వాత ప్లాస్టిక్ బాక్సులు, వాటర్ బాటిల్ అయినా, స్నాక్స్ ప్యాకెట్లైనా.. ఇలా ఎటువంటి చెత్తనైనా సరే డస్ట్ బిన్ లో వేయరు. ఎంత నిర్లక్ష్యం అంటే డస్ట్ బిన్ తమకు అందుబాటులో ఉన్నా దాని పక్కనే చెత్తను వేసే గొప్పవారు కూడా ఉన్నారు. ఇలాంటి ఘటన ఒక రోడ్డుమీద జరిగే అది చూసిన ఓ యువకుడు ఆ పర్యాటకులకు చెప్పిన బుద్దికి సంబంధించిన ఓ వీడియో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మహారాష్ట్ర నుంచి కొడగుకు వచ్చిన పర్యాటకులు కారులో ప్రయాణిస్తూ.. తాము తిన్న చిరుతిళ్ల ప్యాకెట్ల వంటి చెత్తను రోడ్డుపై విసిరి వేశారు. ఇది గమనించిన స్థానిక యువకుడు బైక్‌పై 4 కిలోమీటర్ల మేర పర్యాటకులను వెంబడించి వారు విసిరిన చెత్తను వారికి అందజేసి ఆ పర్యాటకులకు తగిన గుణపాఠం చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

“కొడగులో పర్యాటకులు విసిరిన చెత్తను స్థానిక యువకుడు తీసుకున్నాడు” అనే క్యాప్షన్‌తో @kodaguConnect X ఖాతాలో వీడియో షేర్ చేయబడింది. వీడియోలో, కొడగుకు చెందిన ఓ యువకుడు రోడ్లపై చెత్తను విసిరిన పర్యాటకులకు చెప్పిన గుణపాఠం కి సంబంధించిన వీడియో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

కొడగుకు చెందిన స్థానిక యువకుడు చెత్తను విసిరిన టూరిస్ట్ కారును ఆపి.. మీరు చెత్తను రోడ్డుపై ఎందుకు విసిరారు? ఇలా మా ఊరు వచ్చే ప్రతి పర్యాటకులు చెత్తను రోడ్లపై వేస్తే మా ఊరు ఏమవుతుంది? ఇంత చదువుకున్నారు.. రోడ్ల మీద చెత్త వేయకూడదన్న కనీస కూడా జ్ఞానం లేదా? అని ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు మా కొడగు పర్యాటక ప్రాంతం.. చెత్త కుండీ కాదు.. అంటూనే రోడ్డుపై విసిరే చెత్తను తీసుకోండి అంటూ వారికీ తిరిగి ఆ చెత్తను అందజేశాడు.

జనవరి 04న షేర్ చేసిన ఈ వీడియోకి లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. అనేక కామెంట్స్ వచ్చాయి. ఒకరు “ఈ యువకుడు నిజంగా మంచి పని చేసాడు” అన్నారు. మరోకరు మాట్లాడుతూ.. బాధ్యతా రహితంగా చెత్తవేసేవారికి భారతదేశంలోని అన్ని పర్యాటక ప్రదేశాలలో ఇలాంటి గుణపాఠం చెప్పాలని కామెంట్ చేశారు. ఈ యువకుడి చేసిన పనిని పలువురు వినియోగదారులు ప్రశంసల వర్షం తో అభినందిస్తున్నారు.

మరిన్ని  ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ