AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Rama: రామయ్య మీద భక్తిని విభిన్న రీతిలో చాటుకున్న యువతి.. జై శ్రీ రామ్ బ్యానర్ తో 13 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్

రామయ్య మీద తమ భక్తిని తమదైన రీతిలో తెలుపుతున్నారు కొందరు. కొందరు రామయ్యకు కానుకలను పంపిస్తే.. మరికొందరు తమ గ్రామంలో సంబరాలను జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంతమంది యువకులు పాదయాత్రగా అయోధ్యకు తరలి వెళ్ళితే.. ఒకరు తలపై రామమందిర నమూనాతో తిరుగుతున్నారు. ఇప్పుడు ఓ యువతి స్కై డైవింగ్ చేసి రామమందిర నిర్మాణంపై హర్షం వ్యక్తం చేసింది.

Lord Rama:  రామయ్య మీద భక్తిని విభిన్న రీతిలో చాటుకున్న యువతి.. జై శ్రీ రామ్ బ్యానర్ తో 13 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్
Viral Video
Surya Kala
|

Updated on: Jan 05, 2024 | 10:49 AM

Share

ప్రపంచం నలుమూలల ఉన్న కోట్లాది మంది హిందువులు అయోధ్యలో నిర్మిస్తున్న గొప్ప రామమందిర ప్రారంభోత్సవం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న జరగనున్న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో రామయ్య మీద తమ భక్తిని తమదైన రీతిలో తెలుపుతున్నారు కొందరు. కొందరు రామయ్యకు కానుకలను పంపిస్తే.. మరికొందరు తమ గ్రామంలో సంబరాలను జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంతమంది యువకులు పాదయాత్రగా అయోధ్యకు తరలి వెళ్ళితే.. ఒకరు తలపై రామమందిర నమూనాతో తిరుగుతున్నారు. ఇప్పుడు ఓ యువతి స్కై డైవింగ్ చేసి రామమందిర నిర్మాణంపై హర్షం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో నివసిస్తున్న 22 ఏళ్ల అనామిక శర్మ రామయ్య మీద తన భక్తిని విభిన్న రీతిలో చాటుకుంది. జై శ్రీరామ్ జెండాను పట్టుకుని బ్యాంకాక్‌లో 13,000 అడుగుల ఎత్తు నుండి స్కైడైవింగ్ చేసింది.

ఇవి కూడా చదవండి

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 22 ఏళ్ల అనామిక శర్మ

జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభోత్సవాన్ని జపుకోనుంది. ఈ వేడుకకు ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 6,000 మందికి పైగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, నితీష్ కుమార్, మమతా బెనర్జీ సహా రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, రజనీకాంత్, సంజయ్ లీలా బన్సాలీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మోహన్‌లాల్, ధనుష్, రణబీర్ కపూర్, అలియా భట్, అజయ్ దేవగన్, సన్నీ డియోల్, ప్రభాస్, రిషబ్ శెట్టి వంటి చిత్ర పరిశ్రమకు చెందిన ఇతర ప్రముఖులకు ఆహ్వానం అందించారు.

మరిన్ని  ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..