US. HIndu Temple: కాలిఫోర్నియాలో మరో హిందూ దేవాలయంపై దాడి.. ప్రధాని మోడీపై అభ్యంతరకరమైన రాతలు..
ఖలిస్థాన్ అనుకూల శక్తులు గ్రాఫిటీతో హిందూ దేవాలయం గోడలపై రాతలను రాశారు. ఈ విషయాన్ని హిందూ అమెరికన్ ఫౌండేషన్ సంస్థ తమ సంస్థకు చెందిన పేజీలో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. ఆలయ గోడలపై, బోర్డులపై ఖలిస్తాన్‌కు మద్దతుగా... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని దుర్భాషలాడుతూ రకరకాల రాతలను రాశారు. ఈ విషయంపై ఆలయ అధికారులు స్పందిస్తూ.. ఈ ఘటనపై పోలీసు డిపార్ట్‌మెంట్‌తో పాటు న్యాయ శాఖ , పౌర హక్కుల విభాగంతో టచ్‌లో ఉన్నామని చెప్పారు.
విదేశాల్లో ఉన్న మరో హిందూ దేవాలయం పై దాడి జరిగింది. ఈ ఘటన అమెరికాలో కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఈ విషయంపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) మాట్లాడుతూ.. కాలిఫోర్నియాలోని హేవార్డ్‌లోని విజయ్‌కి చెందిన షెరావలీ ఆలయంపై భారత వ్యతిరేక శక్తులు దాడి చేశారు. స్వామినారాయణ మందిరంపై దాడి జరిగిన రెండు వారాల తర్వాత.. తాజాగా ఈ ఆలయానికి సమీపంలోని శివదుర్గా ఆలయంలో ఈ సంఘటన జరిగింది.
ఖలిస్థాన్ అనుకూల శక్తులు గ్రాఫిటీతో హిందూ దేవాలయం గోడలపై రాతలను రాశారు. ఈ విషయాన్ని హిందూ అమెరికన్ ఫౌండేషన్ సంస్థ తమ సంస్థకు చెందిన పేజీలో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. ఆలయ గోడలపై, బోర్డులపై ఖలిస్తాన్‌కు మద్దతుగా… ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని దుర్భాషలాడుతూ రకరకాల రాతలను రాశారు. ఈ విషయంపై ఆలయ అధికారులు స్పందిస్తూ.. ఈ ఘటనపై పోలీసు డిపార్ట్‌మెంట్‌తో పాటు న్యాయ శాఖ , పౌర హక్కుల విభాగంతో టచ్‌లో ఉన్నామని చెప్పారు.
అంతేకాదు మరొక పోస్ట్‌లో HAF అమెరికాలోని హిందూ ఆలయ భద్రతా మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. అంతేకాదు ఆన్ లైన్ లో ఉన్న గైడ్ లైన్స్ ను పాటించమంటూ ఆలయ నిర్వహణ సిబ్బందికి మరోసారి సూచిస్తున్నట్లు చెప్పారు. ఆలయ గోడల మీద గ్రాఫిటీ ని ఉపయోగిస్తూ ద్వేషపూరిత కామెంట్స్ చేయడం నేరంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. అంతేకాదు ఆలయ ప్రాంగణంలో సిసికేమేరాలు, అలారం సిస్టం ను ఏర్పాటు చేసుకోవాలని వెల్లడించారు. ఖలిస్తాన్ అనుకూల శక్తుల నుండి పెరుగుతున్న ముప్పు ప్రమాదకరమని వెల్లడించారు.
#Breaking: Another Bay Area Hindu temple attacked with pro-#Khalistan graffiti.
The Vijay’s Sherawali Temple in Hayward, CA sustained a copycat defacement just two weeks after the Swaminarayan Mandir attack and one week after a theft at the Shiv Durga temple in the same area.… pic.twitter.com/wPFMNcPKJJ
— Hindu American Foundation (@HinduAmerican) January 5, 2024
డిసెంబర్ 23న, కాలిఫోర్నియాలోని స్వామినారాయణ ఆలయ గోడలు ఖలిస్తాన్ అనుకూల మరియు భారతదేశ వ్యతిరేక నినాదాలతో ధ్వంసమయ్యాయి. శాన్ జోస్ సమీపంలోని స్వామినారాయణ దేవాలయం ధ్వంసం కావడంపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు మరియు ఖలిస్తాన్ సమస్య అని పిలవబడే రెండు దేశాల మధ్య సంబంధాలు చెడగొట్టడం ప్రారంభించినప్పటికీ, భారతదేశం వెలుపల ఉన్న తీవ్రవాదులు మరియు వేర్పాటువాద శక్తులకు అలాంటి స్థలం రాకూడదని అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..