AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iowa school attack: అమెరికాలో స్కూల్ తెరచిన ఫస్ట్ డేనే కాల్పులు, విద్యార్థి మృతి, ఐదుగురికి గాయాలు..

పెర్రీ హైస్కూల్‌ రీపెన్ తర్వాత క్లాసులు మొదలు కావడానికి ముందే కాల్పులు జరిగాయని, అందువల్ల స్కూల్‌లో కొంతమంది విద్యార్థులు,  ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని చెప్పారు. గురువారం ఉదయం 7:37 గంటలకు తమకు కాల్పుల సమాచారం అందిందని ఇన్ఫాంటే తెలిపారు. వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ  చాలా మంది గాయపడినట్లు గుర్తించారు.. చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే డెస్ మోయిన్స్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న యూనిటీ పాయింట్ హెల్త్ ప్రతినిధులు తాము ఇద్దరు ముష్కరులను చూసి నట్లు ధృవీకరించారు.

Iowa school attack: అమెరికాలో స్కూల్ తెరచిన ఫస్ట్ డేనే కాల్పులు, విద్యార్థి మృతి, ఐదుగురికి గాయాలు..
Us School Shooting
Surya Kala
|

Updated on: Jan 05, 2024 | 8:35 AM

Share

అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం సృష్టించాయి. శీతాకాలపు సెలవుల తర్వాత స్కూల్స్ తెరచిన మొదటి రోజునే ఈ దారుణం జరిగింది.  లోవా స్టేట్‌లోని పెర్రీ హైస్కూల్‌ రీ ఓపెన్ చేసిన మొదటి రోజునే కాల్పులు జరిపిన సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఒక స్టూడెంట్ మరణించింది. ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత పాఠశాలలో భయాందోళనలు నెలకొన్నాయి. గురువారం నగరంలోని ఒక ఉన్నత పాఠశాలలో కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారని అయోవా డిఫెన్స్ అధికారి తెలిపారు. ఆ తర్వాత ఇద్దరు ముష్కరులను అంబులెన్స్‌లో రాజధాని డెస్ మోయిన్స్‌లోని అయోవా మెథడిస్ట్ మెడికల్ సెంటర్‌కు తరలించారు.

డల్లాస్ కౌంటీ షెరీఫ్ ఆడమ్ ఇన్ఫాంటే ఈ ఘటన గురించి మాట్లాడుతూ పెర్రీ హైస్కూల్‌ రీపెన్ తర్వాత క్లాసులు మొదలు కావడానికి ముందే కాల్పులు జరిగాయని, అందువల్ల స్కూల్‌లో కొంతమంది విద్యార్థులు,  ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని చెప్పారు. గురువారం ఉదయం 7:37 గంటలకు తమకు కాల్పుల సమాచారం అందిందని ఇన్ఫాంటే తెలిపారు. వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ  చాలా మంది గాయపడినట్లు గుర్తించారు.. చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే డెస్ మోయిన్స్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న యూనిటీ పాయింట్ హెల్త్ ప్రతినిధులు తాము ఇద్దరు ముష్కరులను చూసి నట్లు ధృవీకరించారు.

విచారణలో నిమగ్నమైన అధికారులు

దాడి చేసిన వ్యక్తిని 17 ఏళ్ల డైలాన్ బట్లర్‌గా అధికారులు గుర్తించారు. అయితే దాడికి గల కారణాలపై ఎలాంటి సమాచారం లేదు. పెర్రీలో దాదాపు 8,000 మంది నివాసితులు ఉన్నారు. రాష్ట్ర రాజధాని మెట్రోపాలిటన్ ప్రాంతం అంచున ఉన్న డెస్ మోయిన్స్‌కు వాయువ్యంగా 40 మైళ్లు (65 కిలోమీటర్లు) దూరంలో ఉంది. షూటర్ వద్ద పంప్-యాక్షన్ షాట్‌గన్ తో పాటు చిన్న క్యాలిబర్ హ్యాండ్‌గన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు నిందితుడి బట్లర్ వద్ద ఒక అధునాతన పేలుడు పరికరాన్ని కనుగొన్నారని, అది భద్రపరచబడిందని అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా పోస్ట్‌లపై విచారణ

నిందితుడి ఉద్దేశ్యాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు మోర్ట్‌వైట్ చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో అతడు చేసిన పలు సోషల్ మీడియా పోస్టులపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రాథమిక పాఠశాల నుండి బట్లర్  వేధింపులకు గురవుతున్నాడని తెలుస్తోంది. ఇటీవల కాలంలో నిందితుడి చెల్లెలు కూడా వేధింపులకు గురిఅవుడండంతో అతని ప్రవర్తన తీవ్రంగా మారినట్లు తెలుస్తోంది. ఈ వేధింపులను స్కూల్ యాజమాన్యం అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. జోక్యం చేసుకోలేదు. ఇది బట్లర్‌పై ఎక్కువ ప్రభావం చూపింది.

ముష్కరుడు డెస్ మోయిన్స్‌లోని అయోవా మెథడిస్ట్ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడని అధికార ప్రతినిధి తెలిపారు. ఇతర వ్యక్తులను మరో డెస్ మొయిన్స్ ఆసుపత్రికి తరలించినట్లు MercyOne Des Moines మెడికల్ సెంటర్ ప్రతినిధి ధృవీకరించారు. సంఘటన తర్వాత పాఠశాలను శుక్రవారం మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

గవర్నర్ సంతాపం తెలిపారు అయోవాలోని అన్ని జెండాలను సగం మాస్ట్‌లో ఎగురవేయాలని గవర్నర్ కిమ్ రేనాల్డ్స్ ఆదేశించారు. ఈ అర్ధంలేని విషాదం మన రాష్ట్రాన్ని మొత్తం కుదిపేసిందని ఆయన అన్నారు. వాషింగ్టన్‌లో, ప్రెసిడెంట్ జో బిడెన్, యుఎస్ అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ కాల్పుల గురించి వివరించారు.

కఠినమైన తుపాకీ చట్టాల కోసం డిమాండ్ అమెరికా అంతటా సామూహిక కాల్పుల సంఘటనల కారణంగా చాలా కాలంగా కఠినమైన తుపాకీ చట్టాల కోసం పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..