AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: ఈ హ్యాండ్ బ్యాగ్ రేటుతో ఢిల్లీలో డజను ఫ్లాట్లు కొనొచ్చు.. ఊళ్లలో అయితే ఎకరాల భూమిని సొంతం చేసుకోవచ్చు!

ఈ హ్యాండ్‌బ్యాగ్‌ ల పరిమాణం, రంగు, ధర వాటి నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది మహిళలు రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌ లను, పర్సులను సేకరిస్తారు. తాము వెళ్లే ప్లేస్ ను బట్టి తమ దగ్గర ఉన్న హ్యాండ్‌బ్యాగ్స్ నుంచి ఎంపిక చేసుకుని తీసుకువెళతారు. అయితే ఒక హ్యాండ్‌బ్యాగ్‌ ధర తెలిస్తే షాక్ తింటారు. లేడీస్ హ్యాండ్‌బ్యాగ్‌లు రూ. 500 నుంచి రూ. 10 వేల వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే హ్యాండ్‌బ్యాగ్ ధర ఇక్కడితో ఆగలేదు. లక్షలు, కోట్లకు కూడా చేరుకుంది.

Video Viral: ఈ హ్యాండ్ బ్యాగ్ రేటుతో ఢిల్లీలో డజను ఫ్లాట్లు కొనొచ్చు.. ఊళ్లలో అయితే ఎకరాల భూమిని సొంతం చేసుకోవచ్చు!
Kellymorphose
Surya Kala
|

Updated on: Jan 07, 2024 | 12:48 PM

Share

మహిళలకు నిత్యావసర వస్తువులలో ఒకటిగా హ్యాండ్‌బ్యాగ్‌ మారిపోయింది. ఉద్యోగులు, స్టూడెంట్స్ ఇలా ప్రతి ఒక్కరూ హ్యాండ్‌బ్యాగ్‌ ని ఉపయోగిస్తున్నారు. డబ్బులను, వస్తువులను హ్యాండ్‌బ్యాగ్‌ లో పెట్టుకుంటారు. ఇప్పుడు మార్కెట్‌లో చాలా రకాల హ్యాండ్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ హ్యాండ్‌బ్యాగ్‌ ల పరిమాణం, రంగు, ధర వాటి నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది మహిళలు రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌ లను, పర్సులను సేకరిస్తారు. తాము వెళ్లే ప్లేస్ ను బట్టి తమ దగ్గర ఉన్న హ్యాండ్‌బ్యాగ్స్ నుంచి ఎంపిక చేసుకుని తీసుకువెళతారు. అయితే ఒక హ్యాండ్‌బ్యాగ్‌ ధర తెలిస్తే షాక్ తింటారు.

లేడీస్ హ్యాండ్‌బ్యాగ్‌లు రూ. 500 నుంచి రూ. 10 వేల వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే హ్యాండ్‌బ్యాగ్ ధర ఇక్కడితో ఆగలేదు. లక్షలు, కోట్లకు కూడా చేరుకుంది. ఇటీవ‌ల కాలంలో ఒక్క హ్యాండ్‌బ్యాగ్‌ నెటిజన్లలో చర్చలో నిలిచింది. దీని ధరతో ఢిల్లీ వంటి నగరంలో డజను ఇళ్లను సులభంగా కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న ఈ బ్యాగ్ హెర్మేస్ క్లిమోర్ఫోస్ కంపెనీకి చెందినది. దిగ్గజ గ్రేస్ కెల్లీ పేరు పెట్టబడింది. ఈ బ్యాగ్ దాని చారిత్రక ప్రాముఖ్యతను మాత్రమే కాకుండా దీని గ్లామర్‌ను కూడా ప్రదర్శిస్తుంది. ఇది చాలా అందంగా ఉంది. ఖచ్చితంగా ఎవరినైనా ఆకర్షించగలదు. దీని ధరను చూస్తే సామాన్యులు షాక్ తినాల్సిందే. ధనవంతులు మాత్రమే దీనిని సొంతం చేసుకోవచ్చు. అదే సామాన్యులు అయితే ఈ హ్యాండ్‌బ్యాగ్‌ కు పెట్టె ధరతో దేశ రాజధాని ఢిల్లీలో డజను ఫ్లాట్లు కొనుగోలు చేయవచ్చు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి ప్రెస్టీజ్ ప్యాలెస్ (@prestigepalace.ae) ద్వారా భాగస్వామ్యం చేయబడిన పోస్ట్

వీడియోలో చూపిన కెల్లీమార్ఫోస్ బ్యాగ్ లెదర్ ట్రాపెజోయిడల్ ఆర్కిటెక్చర్‌లో రెండు వైపులా పట్టీలు, క్లాస్ప్, ప్యాడ్‌లాక్, లాక్ సిస్టమ్‌తో రూపొందించబడింది. ఈ బ్యాగ్ ధర భారత దేశ కరెన్సీ లో రూ.14,71,88,495. @prestigpalace.ae అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాలో వీడియో భాగస్వామ్యం చేయబడింది. ఇప్పటికే ఈ బ్యాగ్ ను కోట్లాది మంది చూసి కామెంట్స్ చేశారు. రకరకాల కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని  ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..