Viral News: సృష్టిలో చిత్రాలు ఎన్నో… ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. ఇలాంటి కేసు లక్షల్లో కాదు కోట్లలో ఒకటి
సంతోషాన్ని రెట్టింపు చేస్తూ కవలలు పుడితే అప్పుడు ఆ భార్యాభర్తల సంతోషానికి హద్దే ఉండదు. అయితే ఒక బిడ్డకు జన్మ నివ్వడం అనేది అంత సులభం కాదు. తన ప్రాణాలను ఫణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది స్త్రీ. అయితే ప్రస్తుతం అనేక రకాల ప్రెగ్నెన్సీ ఉదంతాల గురించి వింటునే ఉన్నాం. వీటిలో ఒకటి ట్రిపుల్ ప్రెగ్నెన్సీ, ఇందులో ముగ్గురు పిల్లలు కలిసి పుడతారు. ఇటువంటి సంక్లిష్ట గర్భధారణ కేసులు ప్రజలను మాత్రమే కాదు వైద్యులను కూడా ఆశ్చర్యపరుస్తాయి.
ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. పెళ్లయిన తర్వాత దంపతులు తమ ప్రతి రూపం ఇంట్లో తిరుగాడే సమయం కోసం ఎదురుచూస్తారు. ప్రతి ఇంట్లోని ప్రతి ఒక్కరు కొత్త సభ్యుల రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. తల్లి కాబోతున్న విషయం వినగానే ఆ దంపతులు మాత్రమే కాదు.. ఇల్లంతా సందడి నెలకొంటుంది. చిన్నపిల్లల రాక కోసం ఎదురుచూడడం మొదలు పెడతారు. అయితే వారి సంతోషాన్ని రెట్టింపు చేస్తూ కవలలు పుడితే అప్పుడు ఆ భార్యాభర్తల సంతోషానికి హద్దే ఉండదు. అయితే ఒక బిడ్డకు జన్మ నివ్వడం అనేది అంత సులభం కాదు. తన ప్రాణాలను ఫణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది స్త్రీ. అయితే ప్రస్తుతం అనేక రకాల ప్రెగ్నెన్సీ ఉదంతాల గురించి వింటునే ఉన్నాం. వీటిలో ఒకటి ట్రిపుల్ ప్రెగ్నెన్సీ, ఇందులో ముగ్గురు పిల్లలు కలిసి పుడతారు.
ఇటువంటి సంక్లిష్ట గర్భధారణ కేసులు ప్రజలను మాత్రమే కాదు వైద్యులను కూడా ఆశ్చర్యపరుస్తాయి. UKలోని హడర్స్‌ఫీల్డ్ వెస్ట్ యార్క్స్ లో ప్రస్తుతం ఒక వైద్య చరిత్రలో అరుదైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ ఏకకాలంలో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. వైద్యులు ఈ కేసును అధ్యయనం చేసినప్పుడు.. ఇలాంటి జనన సంఘటనలు 200 మిలియన్లలో ఒకటి అంటే 20 కోట్లలో ఒకటి అని వైద్యులు చెప్పారు. తల్లి లౌజీ , తండ్రి గారెత్ తమ ముగ్గురు కుమార్తెలు విల్లో, నాన్సీ, మాబెల్ డేవిస్‌లను చూసినప్పుడు.. వారి ముఖాలు ఒకేలా కనిపించాయి.
ఈ పిల్లలు ఎందుకు ప్రత్యేకం అంటే
ముగ్గురు బాలికల ముఖాలను చూసి తల్లిదండ్రులు పిల్లలకు జన్యుపరమైన పరీక్షలు చేయించారు. ఈ పరీక్షలో ముగ్గురూ ఒకే రకమైన జన్యువులు కలిగి ఉన్నారని అని తేలింది. ఈ పరిశోధనలో వారి జన్యువులు ఒకదానితో ఒకటి సరిపోలుతున్నాయని.. చాలా అరుదుగా ఒకేలాంటి అక్కాచెల్లెళ్లు అని వెలుగులోకి వచ్చింది.
ది సన్ అనే ఆంగ్ల వెబ్‌సైట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం ఈ ముగ్గురూ గతేడాది నవంబర్ 10న జన్మించారు. విల్లో బరువు 4 పౌండ్లు 8 ఔన్సులు, నాన్సీ 5 పౌండ్లు, మాబుల్ 4 పౌండ్లు 11 ఔన్సులు. అయితే ఈ బాలికలను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే సాధారణంగా ముగ్గురు పిల్లలు జన్యుపరంగా ఒకేలా ఉండరు. అయితే వీరు మాత్రం ఒకే విధమైన జన్యువులు కలిగి వున్నారు. ఇలాంటి జననాలు బహు అరుదని గత మూడేళ్లలో వెలుగులోకి వచ్చి మూడో కేసు ఇదని చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..