Viral Video: బాలుడి ఫన్నీ వీడియో షేర్ చేసిన IPS అధికారి.. మీరు ఇలా వెళ్తే ఎలా స్వాగతం చెప్పారంటూ చిలిపి ప్రశ్న…

నవనీత్ సికెరా తన అధికారిక ట్విట్టర్ ఐడి నుండి ఈ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. మీ చిన్నతనంలో మీరు ఇలా ఇంటికి ఎన్నిసార్లు చేరుకున్నారు. ఆ తర్వాత మీకు ఏ ఆయుధంతో మీ అమ్మ మీకు స్వాగతం పలికారు ?' అంటూ ఫన్నీ కామెంట్ చేశారు. కేవలం 8 సెకన్ల ఈ ఫన్నీ వీడియోను ఇప్పటివరకు 21 వేలకు పైగా వీక్షించగా వందలాది మంది వీడియో లైక్ చేశారు.

Viral Video: బాలుడి ఫన్నీ వీడియో షేర్ చేసిన IPS అధికారి.. మీరు ఇలా వెళ్తే ఎలా స్వాగతం చెప్పారంటూ చిలిపి ప్రశ్న...
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 08, 2024 | 8:10 PM

సోషల్ మీడియాలో రొజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని షాకింగ్ గా ఉంటాయి. ఈ వీడియోల్లో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. కొన్ని వీడియోలు చూసి తమ బాల్యాన్ని గుర్తు చేసుకుంటారు. అవును బాల్యం ప్రతి ఒక్కరికీ మధుర జ్ఞాపకం. ఆహ్లాదకరమైన సమయం. కల్లాకపటం లేకుండా నచ్చిన పనిని చేసే పిల్లల చేష్టలలో వినోదం మాత్రమే ఉంటుంది. స్కూల్లో అయినా, ఇంట్లో అయినా అల్లరి చేసి తరచుగా తల్లిదండ్రులతో దెబ్బలు తింటారు కూడా. అయితే కొంతకాలం తర్వాత పిల్లలు ఆ విషయాలు మర్చిపోతారు. అయితే పెద్దయ్యాక తమ చిన్ననాటి పనులను నేమరవేసుకుంటూ నవ్వుకుంటారు. నవనీత్ సికేరా అనే IPS అధికారి విషయంలో కూడా అలాంటిదే జరిగింది. దేశంలోని అత్యంత శక్తివంతమైన IPS అధికారులలో ఒకరుగా కీర్తింపబడుతున్నారు.

నవనీత్ సికెరా సోషల్ మీడియాలో ఒక పిల్లాడికి సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఇది చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియోలో చిన్నారి బాలుడు పూర్తిగా బురదలో స్నానం చేసినట్లు కనిపింస్తున్నాడు. బాలుడు బట్టలు పూర్తిగా మురికిగా మారాయి. శరీరం మొత్తం తడి బురదతో నిండిపోయింది. బాలుడు తన ప్యాంటును ఒక చేతిలో పట్టుకొని, మరొక చేతిలో చెప్పులు పట్టుకుని రోడ్డుమీద నడుస్తున్నాడు. చిన్నారి వీడియో చూస్తే ఆడుకుంటూ బురదలో స్నానం చేసి ఉండవచ్చు లేదా చేపలు పట్టాలని ప్రయత్నం చేసి ఈ పరిస్థితికి వచ్చి ఉండవచ్చు అని అనిపిస్తుంది. అయితే ఆ బాలుడు ఇలా బురదతో ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అతని పరిస్థితి ఎలా ఉంటుందో మీకు కూడా బాగా తెలుసు.

ఇవి కూడా చదవండి

ఫన్నీ వీడియో చూడండి

నవనీత్ సికెరా తన అధికారిక ట్విట్టర్ ఐడి నుండి ఈ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. మీ చిన్నతనంలో మీరు ఇలా ఇంటికి ఎన్నిసార్లు చేరుకున్నారు. ఆ తర్వాత మీకు ఏ ఆయుధంతో మీ అమ్మ మీకు స్వాగతం పలికారు ?’ అంటూ ఫన్నీ కామెంట్ చేశారు. కేవలం 8 సెకన్ల ఈ ఫన్నీ వీడియోను ఇప్పటివరకు 21 వేలకు పైగా వీక్షించగా వందలాది మంది వీడియో లైక్ చేశారు.

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు కూడా వివిధ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నేను ఒక్కసారి కూడా అలాంటి పరిస్థితికి రాలేదు.. అయితే ఇతర సందర్భాల్లో తనకు రకరకాల ఆయుధాలతో స్వాగతం పలికారు’ అని ఒకరు రాయగా.. మరోకరు కూడా అదే విధంగా స్పందిస్తూ చెప్పులతో ఇలా ఇంటికి చేరుకుంటే అమ్మ దెబ్బలకు దెయ్యం దిగి వచ్చింది. అని కామెంట్ చేయగా.. అదే సమయంలో నదీస్నానం చేసినందుకు, బురదలో అడుగు పెట్టిన నన్ను చాలాసార్లు కొట్టారు సార్’ అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు తనకు చీపురు పట్టి స్వాగతం పలికారని రాశారు.

మరిన్ని  ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..