Ayodhya: ప్రతిష్ఠాపనకు ముందు బాల రామయ్య కళ్లకు గంతలు ఎందుకు కట్టారు? ఆ రహస్యం ఏమిటంటే

శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రకారం ప్రాణ ప్రతిష్ఠకు ముందు జనవరి 17న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ రోజున రామభక్తులు శ్రీరాముని విగ్రహాన్ని దర్శించుకోగలరు. ఇందుకోసం అయోధ్యలో నగర యాత్ర కూడా చేపట్టనున్నారు. అదే రోజు విగ్రహం ఫోటో, వీడియోను ప్రజలను దర్శించేందుకు వీలుగా విడుదల చేస్తారు. నగర పర్యటన నేపధ్యంలో రాముని విగ్రహం బయటకు తీసుకుని వచ్చే సందర్భంలో బాల రాముడిని కళ్ళు భక్తులకు కనిపించవు.

Ayodhya: ప్రతిష్ఠాపనకు ముందు బాల రామయ్య కళ్లకు గంతలు ఎందుకు కట్టారు? ఆ రహస్యం ఏమిటంటే
Ram Lalla Idol
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2024 | 3:05 PM

ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో రాముడి జన్మస్థలంలో కొత్తగా నిర్మించిన ఆలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతి ష్ఠాపన 22 జనవరి 2024న జరుగుతుంది. ప్రతిష్ఠాపనకు ఎంపికైన విగ్రహం చర్చనీయాంశంగానే ఉంది. 22వ తేదీన గర్భ గుడిలో బాల రామయ్యను ప్రతిష్టించే వరకూ ఆ విగ్రహానికి కళ్లకు గంతలు కట్టే ఉంటుది. విగ్రహం ఆవిష్కరించే వరకూ బాల రామయ్య కళ్లు కనిపించవు. అతను అవిత్రంగా గర్భ గుడిలో అధిష్టించిన తర్వాత మాత్రమే రామ్ లల్లా కళ్లకు ఉన్న గంతలు తొలగించబబడతాయి. అయితే ప్రతిష్ఠాపనకు ముందు బాల రాముడి కళ్లకు ఎందుకు గంతలు కట్టారు..? దీని వెనుక రహస్యం ఏమిటి? ఈ రోజు తెలుసుకుందాం..

శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రకారం ప్రాణ ప్రతిష్ఠకు ముందు జనవరి 17న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ రోజున రామభక్తులు శ్రీరాముని విగ్రహాన్ని దర్శించుకోగలరు. ఇందుకోసం అయోధ్యలో నగర యాత్ర కూడా చేపట్టనున్నారు. అదే రోజు విగ్రహం ఫోటో, వీడియోను ప్రజలను దర్శించేందుకు వీలుగా విడుదల చేస్తారు. నగర పర్యటన నేపధ్యంలో రాముని విగ్రహం బయటకు తీసుకుని వచ్చే సందర్భంలో బాల రాముడిని కళ్ళు భక్తులకు కనిపించవు. ఎందుకంటే రామ్ లల్లా కళ్లకు ఒక గుడ్డతో గంతలు కట్టి ఉంటాయి.

విగ్రహం కళ్లకు ఎందుకు గంతలు కడతారాంటే

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఎవరైనా భక్తులు దైవాన్ని దర్శించుకునే సమయంలో ముందుగా విగ్రహం కళ్ళవైపుకి చూస్తాడు. ఎందుకంటే కళ్ళు శక్తికి ప్రధాన కేంద్రం. అప్పుడు భక్తుల భావాలతో పాటు దైవం భావాలు కూడా మారతాయి. ఇందుకు ఉదాహరణగా బాంకే బిహారీ ఆలయం గురించి ప్రస్తావిస్తారు. ఇక్కడ ఆలయంలో భక్తులు కన్నయ్య కళ్లలోకి ఎక్కువ సేపు చూడకుండా గర్భగుడి తెర తరచుగా మూసివేస్తారు. ఎందుకంటే ఒకసారి ఒక భక్తుడు భగవంతుని కళ్లలోకి చాలా ప్రేమతో 30 సెకన్ల పాటు చూశాడు.. అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ భక్తుని ప్రేమకు దాసోహం అయ్యిగుడిని వదిలి ఆ భక్తుడితో కలిసి వెళ్లిపోయాడట.

అంటే దేవుడి విగ్రహంలో కళ్లు అత్యంత ముఖ్యమైనవి. అందువల్ల ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మాత్రమే కళ్ళు తెరవబడతాయి. భగవంతుని విగ్రహం కళ్లలోకి చూస్తే శక్తి, సానుకూలత.. ఆధ్యాత్మిక ఆనందం కలుగుతాయి. అందువల్ల నగర పర్యటనలో రామయ్య విగ్రహం కళ్ళు కప్పబడి ఉంటాయి. దీక్షకు ముందు రామ్ లల్లా కళ్లకు గంతలు కట్టడమే ఇక్కడ కారణం.

రామ్ లల్లా విగ్రహం ఎందుకు ప్రత్యేకమో తెలుసా?

రామ్ లల్లా విగ్రహం ప్రత్యేకమైందంటే.. నేపాల్‌లోని నారాయణి నది నుండి శాలిగ్రామ శిలను తీసుకువచ్చి ఈ విగ్రహాన్ని సిద్ధం చేశారు. శాలిగ్రామం విష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఇపుడు ఆ శాలిగ్రామం మలచిన విగ్రహ శ్రీ రాముని రూపం. రామయ్య విష్ణువు అవతారం. కనుక ఈ విగ్రహం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు