V Hanumantha Rao: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వీహెచ్ ప్రశంసల జల్లు.. అంతలోనే విమర్శల వాక్బాణాలు..

V Hanumantha Rao: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ప్రశంసలు కురిపించారు. 'దళిత బంధు'..

V Hanumantha Rao: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వీహెచ్ ప్రశంసల జల్లు.. అంతలోనే విమర్శల వాక్బాణాలు..
V Hanumantha Rao
Follow us

|

Updated on: Jul 28, 2021 | 3:54 PM

V Hanumantha Rao: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ప్రశంసలు కురిపించారు. ‘దళిత బంధు’ పథకాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్ చేసిన నిర్ణయాన్ని అభినందించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన వీహెచ్.. ‘దళితులు… ధనికులు కావాలనే సీఎం కేసీఆర్ ఆలోచనను బాగుంది. సీఎం కేసీఆర్ ఏడేళ్ల తరువాత మొట్టమొదటి సారి అంబెద్కర్ ఫొటోకు పూలమాల వేయడం చూస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ పదిలక్షలు ఇస్తేనే కేసీఆర్ దళిత బాంధవుడు అవుతాడు.’ అని అన్నారు.

ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌పై పలు విమర్శలు కూడా చేశారు వీహెచ్. అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ప్రభుత్వం లాకప్‌లో పెట్టిందని విమర్శలు గుప్పించారు. అంబెద్కర్ విగ్రహాన్ని లాకప్‌లో పెట్టి దళిత బంధు అంటే ఎవరు నమ్మరని అన్నారు. రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ దళితబందు అమలు చేస్తేనే కేసీఆర్‌కు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లుగా భావిస్తామన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలకంటే ముందే లాకప్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వీహెచ్ డిమాండ్ చేశారు. దళితులకు భోజనం పెట్టి, ఫొటోకు దండవేస్తె అంబెద్కర్‌పై చిత్తశుద్ధి ఉన్నట్లు కాదన్నారు. అసలు అంబెద్కర్ విగ్రహం తేవడమే తాను చేసిన తప్పా? అని వీహెచ్ ప్రశ్నించారు. తమ పార్టీలో అంబెడ్కర్ విగ్రహం కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేశానని, కానీ తమ పార్టీ వాళ్లు వైఎస్ విగ్రహం పక్కన అంబేద్కర్ విగ్రహం పెట్టారని భావించారేమో అని వ్యాఖ్యానించారు. ఆ కారణంగానే కావొచ్చు.. తమ పార్టీకి చెందిన నేతలెవరూ దానిపై మాట్లాడటం లేదు అని వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కస్టడీలో ఉంచిన అంబేద్కర్ విగ్రహాన్ని ఇవ్వకపోతే.. సీఎం కేసీఆర్‌ది దళితులపై కపట ప్రేమాగా భావిస్తామని వీహెచ్ పేర్కొన్నారు.

Also read:

Viral Photos : గాయపడిన కుక్క కోసం చిన్నారుల ఆవేదన..! హార్ట్ టచింగ్ ఫొటోస్..

జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా ఎప్పుడు వస్తుందంటే ..? ఆ రోజు ఎంతో దూరంలో లేదంటూ చెప్పేసిన కేంద్రం !

Varshini : అందాల యాంకరమ్మ… అంత వయ్యారం ఎందుకమ్మా..