జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా ఎప్పుడు వస్తుందంటే ..? ఆ రోజు ఎంతో దూరంలో లేదంటూ చెప్పేసిన కేంద్రం !
జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి ఎప్పడు వస్తుందన్నదానిపై కేంద్రం మొదటిసారిగా పార్లమెంటులో క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఈ చోట సాధారణ పరిస్థితులు నెలకొనగానే దీనికి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని...
జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి ఎప్పడు వస్తుందన్నదానిపై కేంద్రం మొదటిసారిగా పార్లమెంటులో క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఈ చోట సాధారణ పరిస్థితులు నెలకొనగానే దీనికి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో తెలిపారు. తగిన సమయంలో కేంద్రం ఇందుకు నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ యూనియన్ టెరిటరీలో ఉగ్రవాద కార్యకలాపాలు చాలావరకు తగ్గాయన్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదికి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఆయన.. జమ్మూ కాశ్మీర్ లో ఇంకా సాధారణ పరిస్థితులు ఏర్పడవలసిన అవసరం ఉందన్నారు. 2019 తో పోలిస్తే.. అక్కడ టెర్రరిస్టు సంబంధ ఘటనలు 2020 లో 59 శాతం ఉండగా.. ఈ ఏడాది జూన్ నాటికి ఇవి 32 శాతానికి తగ్గాయని వెల్లడించారు. ఇంకా ఉగ్రవాద కార్యకలాపాలను అదుపు చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. టెర్రరిస్టు గ్రూపులకు ఎవరు ఆశ్రయం కల్పిస్తున్నారో, ఎవరు తోడ్పడుతున్నారో భద్రతా దళాలు నిరంతరం నిఘా వేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
కాశ్మీరీ పండిట్ల పునరావాసం గురించి ప్రస్తావిస్తూ.. ప్రసుతం కాశ్మీర్ లో 900 కాశ్మీరీ పండిట్లు, డోగ్రా హిందూ కుటుంబాలు ఉన్నాయని, వారి భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని నిత్యానంద రాయ్ వెల్లడించారు. ఇటీవల ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ కి చెందిన అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. మొదట అక్కడ నియోజకవర్గాల పునర్వర్గీకరణ జరగాల్సి ఉందని, త్వరలో ఈ ప్రక్రియ చేబడతామని, ఆ తరువాత ఎన్నికల విషయమై యోచిస్తామని ఆయన చెప్పారు. ఆ సమావేశంలో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ తదితర పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి :Bunny Vasu – Sundar Pichai Video: గూగుల్ CEO సుందర్ పిచాయ్‌కు లేఖ రాసిన మెగా నిర్మాత బన్నీ వాసు..
ఆంధ్ర-తమిళనాడు బోర్డర్ కుప్పంలో పోలీసుల పేరుతో కర్ణాటక దొంగల హల్‌చల్..:Kuppam Video.