Parliament: “పెగాసస్” ప్రకంపనలతో దద్దరిల్లిన పార్లమెంటు.. స్పీకర్‌పై కాగితాలు విసిరేసిన ప్రతిపక్ష ఎంపీలు..!
పెగాసస్ ప్రకంపనలు ఇవాళ పార్లమెంటును కుదిపేసింది. ప్రజాప్రతినిధులం అన్న విషయం మరిచిన ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య దేవాలయంలో విచక్షణారహితంగా ప్రవర్తించారు.
Congress MPs hurl papers at Speaker chair: పెగాసస్ ప్రకంపనలు ఇవాళ పార్లమెంటును కుదిపేసింది. ప్రజాప్రతినిధులం అన్న విషయం మరిచిన ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య దేవాలయంలో విచక్షణారహితంగా ప్రవర్తించారు. ఏకంగా లోక్‌సభ స్పీకర్‌పై చిత్తు కాగితాలు విసిరిన ప్రతిపక్ష పార్టీల సభ్యులు నిరసన తెలిపారు.
మంగళవారం ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్ష ఎంపీలు సభ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్లకార్డులు చేతబట్టి గట్టిగట్టిగా నినాదాలు చేశారు. లోక్‌సభలో అయితే, కాంగ్రెస్ ఎంపీలు పేపర్లు చించి స్పీకర్ ఛైర్‌పైకి విసిరారు. దీంతో ఒక్కసారిగా లోక్‌సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు రెండుసార్లు వాయిదా పడ్డాయి.
ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన ఎంపీలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. వారి ఆందోళనల నడుమే సభాపతి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో విపక్ష సభ్యులు నిరసనను మరింత ఉద్ధృతం చేశారు. ఇటు అధికార పక్ష ఎంపీలు సైతం ప్రతికూల నినాదాలు చేశారు. కాగా, కొందరు కాంగ్రెస్ ఎంపీలు పేపర్లు చించేసి స్పీకర్ ఛైర్, ట్రెజరీ బెంచ్‌లపైకి విసిరేశారు. దీంతో ఆగ్రహానికి గురైన సభాపతి సభను మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాయిదా వేశారు. విరామం తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ సభ్యులు మరోసారి ఆందోళనకు దిగడంతో.. మరోసారి సభ కంట్రోల్‌లో లేకపోవడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది.
Lok Sabha has passed the Insolvency and Bankruptcy Code (A) Bill, 2021
House adjourned till 3pm pic.twitter.com/V8kTFWUCia
— ANI (@ANI) July 28, 2021
అటు, రాజ్యసభలోనూ అదే గందరగోళం కన్పించింది. విపక్షాల నిరసనలతో ఈ ఉదయం సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ 12 గంటలకు సభ మొదలవగా.. విపక్ష ఎంపీలు సీట్లలో నుంచి లేచి ఆందోళన చేపట్టారు. పెగాసస్‌పై చర్చ జరపాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
Rajya Sabha adjourned till 2 pm over uproar by Opposition MPs, demanding a discussion over the ‘Pegasus Project’ report https://t.co/rS5wPYzQrB pic.twitter.com/hLQNMl9oKy
— ANI (@ANI) July 28, 2021