Telangana: కాళ్లు, చేతులు విరిచి కూర్చోబెడతారు.. బండి వ్యాఖ్యలకు కేసీఆర్ స్ట్రాంగ్ రియాక్షన్..
తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాటల పంచ్ లు పేలాయి. బండి సంజయ్, రేవంత్ రెడ్డి టార్గెట్‌గా సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ తరువాత అసెంబ్లిలో మొదటిసారి బీజేపీ ఎమ్మెల్యే..

తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాటల పంచ్ లు పేలాయి. బండి సంజయ్, రేవంత్ రెడ్డి టార్గెట్‌గా సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ తరువాత అసెంబ్లిలో మొదటిసారి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు ప్రస్తావించారు. కేసీఆర్ తన ప్రసంగంలో ఈటల పేరును పదే పదే చెప్పుకొచ్చారు. మొత్తం తన ప్రసంగంలో 12 సార్లు ఈటెల పేరును కేసీఆర్ ప్రస్తావించడం గమనార్హం.
సీఎం నోట ఈటెల పేరు..
అవును, ఇంతకాలం ఈటెల పేరు పలకడానికే అయిష్టతను ప్రదర్శించిన సీఎం కేసీఆర్.. నేడు అసెంబ్లీ వేదికగా పదే పదే ఈటల రాజేందర్ పేరును ప్రస్తావించారు. రెండున్నర గంటలపాటు సాగిన ప్రసంగంలో దాదాపు 12సార్లు ఈటల పేరును ప్రస్తావించారు సీఎం. అంతేకాదు.. ఈటల రాజేందర్ చేసిన సూచనలన్నింటినీ స్వీకరించి, సమస్యలు పరిష్కరించాలని సంబంధిత మంత్రులను ఆదేశించారు సీఎం కేసీఆర్.
స్పందించిన రాజేందర్..
అసెంబ్లీలో కేసీఆర్ తనను డ్యామేజ్ చేశారని తీవ్రంగా స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడలేదని, వాళ్లే బయటకు పంపారని గుర్తు చేశారు. మళ్లీ తనను పిలిచినా వెళ్లలని కుండబద్దలుకొట్టారు ఈటల. ప్రజా సమస్యలపై చర్చించేందుకే అసెంబ్లీకి వచ్చానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పిలిస్తే వెళ్తానని స్పష్టం చేశారు. తాను బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌నని ఉద్ఘాటించారు.




బండి వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ రియాక్షన్..
ఇటు సచివాలయం కూలుస్తామని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కామెంట్స్, అటు ప్రగతి భవన్ కూల్చివేస్తామంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ చేస్తున్న కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించారు సీఎం కేసీఆర్. ఇద్దరు నేతలకు అసెంబ్లీ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘సచివాలయం, ప్రగతి భవన్ కూలుస్తామంటే ఎవరు ఊరుకుంటారు? కాళ్లు, చేతులు విరిచి కూర్చోబెడతారు’ అని సీరియస్‌గా స్పందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
