Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పార్లమెంటు కొత్త భవనానికి అంబేద్కర్ పేరు.. గద్దర్ వినతిని కేంద్రానికి పంపిన బండి సంజయ్

పార్లమెంటు భవనానికి భారత రాజ్యంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్..

Telangana: పార్లమెంటు కొత్త భవనానికి అంబేద్కర్ పేరు.. గద్దర్ వినతిని కేంద్రానికి పంపిన బండి సంజయ్
Bandi Sanjay
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 14, 2022 | 1:09 PM

Telangana: పార్లమెంటు భవనానికి భారత రాజ్యంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సైతం పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా గాయకుడు గద్దర్ ఇటీవల బండి సంజయ్ ను కలిసి పార్లమెంట్ నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేలా కృషిచేయాలని వినతి పత్రం అందజేశారు. ఈమేరకు బండి సంజయ్ గద్దర్ వినతిపత్రాన్ని కేంద్రప్రభుత్వానికి పంపించారు. ఇప్పటికే కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టడం సముచితమనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. దళిత సంఘాలతో పాటు పలు పార్టీలు కూడా ఈడిమాండ్ చేస్తున్నాయి. తాజాగా దేశ అత్యున్నత చట్టసభకు రాజ్యాంగ నిర్మాత, మహాదార్శనికుడు, సామాజిక న్యాయ పోరాట రథసారథి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌ పేరుపెట్టాలన్న తీర్మానాన్ని తెలంగాణ శాసన సభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి రాజ్యంగ నిర్మాత డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడమే ఆమనకు మనం ఇచ్చే గౌరవమని ఈసందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొంటూ పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టాలంటూ సెప్టెంబర్ 13వ తేదీన ఆయన అసెంబ్లీలో తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. తెలంగాణ శాసనసభ తీర్మానం చేసిన మరుసటి రోజే బండి సంజయ్ కూడా పార్లమెంటు భవనానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తిచేయడం గమనర్హం.

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న VRAలపై లాఠీ ఛార్జ్ ను నిరసిస్తూ బండి సంజయ్ బృందం నల్ల బ్యాడ్జిలు ధరించి పాదయాత్రను కొనసాగిస్తోంది. వీఆర్ ఏల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని ఈసందర్భంగా బండి సంజయ్ డిమాండ్ చేశారు. వీఆర్ ఏలపై లాఠీఛార్జ్ ను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..