హైదరాబాద్, ఆగస్టు 12: తెలంగాణలో బీజేపీ మరింత స్పీడ్ పెంచుతోంది. పోరాట పంథాలో ముందుకు వెళ్లాలని భావిస్తోన్న కమలం పార్టీ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో సమరశంఖం పూరించింది. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించింది. ఇక.. బీజేపీ మహాధర్నాలో భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు కిషన్‌రెడ్డి. ఇంతకీ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కమలనాథుల కార్యాచరణ ఏంటి?.. ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్చేస్తూ తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ఈటల రాజేందర్సహా పలువురు జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా.. బీజేపీ మహాధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పేపర్ల మీద ఉంటాయి తప్ప.. పేదలకు అందవని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ప్రభుత్వానికి పేదల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు కిషన్‌రెడ్డి.
పేదలకు సొంతింటి కల నెరవేర్చేదాకా పోరాటం ఆగదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తావా? గద్దె దిగుతావా? నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడే నిలదీయండి. – మహాధర్నా ముగింపు కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు @kishanreddybjp గారి పిలుపు.
మరోవైపు.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ.. సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లో విశ్వరూప ధర్నా నిర్వహిస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పేదలకు ఇళ్లు దక్కేంతవరకు ఆందోళనలను ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. మొత్తంగా.. ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని తెలంగాణ బీజేపీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన బీజేపీ మహాధర్నా సక్సెస్ కావడంతో.. రాబోయే రోజుల్లో ప్రజలతో కలిసి ప్రభుత్వంపై మరింత పోరాడాలని డిసైడ్ అయింది.
పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం బిజెపి మహాధర్నా. వర్షంలోనూ తడుస్తూ ధర్నాలో పాల్గొనేందుకు తరలి వచ్చిన జనం. ధర్నాతో దద్దరిల్లిన ధర్నా చౌక్.
తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ గా కిషన్ రెడ్డి నియామకం అనంతరం.. అధిష్టానం నేతలకు పలు సూచనలు సలహాలను అందిస్తూ.. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. దీనిలో భాగంగా ఢిల్లీ వేదికగా పలువురు కీలక నేతలతో మంతనాలు సైతం జరిపింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రజల్లోనే ఉండేలా కార్యచరణను సిద్ధం చేసుకోవాలని.. ఆ దిశగా ముందుకు వెళ్లాలని సూచించింది. అంతేకాకుండా నియోజకవర్గాల వారీగా స్పీడును పెంచాలని.. అనవసర విషయాలపై ఫోకస్ పెట్టొద్దంటూ కూడా పేర్కొంది. దీంతో తెలంగాణ బీజేపీ అధిష్టానం సూచనలతో పలు కార్యక్రమాలను సిద్ధం చేసుకుంటూ ముందుకుపోతోంది.
అన్నింటా అవినీతి
రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అహంకారి