Telangana: కేంద్రంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించడం ఖాయం: కేటీఆర్
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందన్నారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ మద్దతు లేకుండా ఎవరూ ప్రధానమంత్రి కాలేరని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్. మోదీ లాంటి వారు ఉన్నంతకాలం.. ఆయన ఆడిస్తే ఆడే డూడూ బసవన్నలు ఉన్నంతకాలం... పరిస్థితులు మారవన్నారు. కేటీఆర్ కామెంట్స్‌కు సంబంధిచిన కీలక డీటేల్స్ దిగువన ఉన్న వీడియోలో చూసేద్దాం పదండి
తెలంగాణ, ఆగస్టు 12: వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో చేనేత వారోత్సవాల్లో పాల్గొన్న కేటీఆర్…కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందన్నారు. బీఆర్ఎస్ మద్దతు లేకుండా ఎవరూ ప్రధానమంత్రి కాలేరన్న ఆయన.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతల్నే గెలిపించుకోవాలన్నారు. కేసీఆర్ అయితే కేంద్రం మెడలు వంచగలరని, కొట్లాడగలరని కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు.. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్. మోదీ లాంటి వారు ఉన్నంతకాలం.. ఆయన ఆడిస్తే ఆడే డూడూ బసవన్నలు ఉన్నంతకాలం… పరిస్థితులు మారవన్నారు. ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని కేటీఆర్ అన్నారు. మూడు పంటలకు నీళ్లిచ్చే KCR కావాలా? మూడు గంటల కరెంట్ ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ కావాలా తేల్చుకోవాలని ప్రజలను KTR కోరారు. ఢిల్లీ పార్టీ నాయకులు కూర్చొవాలన్నా, నిలబడాలన్నా ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకోవాలని, కాని తమ పార్టీ బాసులు తెలంగాణ గల్లీల్లో ఉన్నారని KTR అన్నారు.