Andhra Pradesh: వాలంటీర్ వ్యవస్థ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైంది: పవన్
పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు NOC కావాలి కానీ, వాలంటీర్ ఉద్యోగానికి ఏం అవసరం లేదన్నారు పవన్. ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు పోలీసుల చేతులను కట్టేస్తున్నారన్నారు. వాలంటీర్ చేసిన దుర్మార్గాన్ని బయటపెట్టిన పోలీసులకు పవన్‌కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నం నుంచే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని పవన్‌కల్యాణ్ అనడం సంచలనంగా మారింది. త్తరాంధ్రలో 151 మంది చిన్నారులు అదృశ్యమయ్యారన్నారు. శాంతిభద్రతలను, వ్యవస్థను కాపాడే బాధ్యత పోలీసులదేనని ఈ సందర్భంగా పవన్ గుర్తుచేశారు.
వలంటీర్ల వ్యవస్థపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. పెందుర్తి నియోజకవర్గంలోని సుజాతనగర్‌లో ఓ వృద్దురాలిని వాలంటీర్ కిరాతకంగా హత్య చేసి బంగారు నగలను ఎత్తుకెళ్లాడని ఆరోపించారు. ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ పెరుగుతోందని, ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా చెప్పిందన్నారు. ఆంక్షలు తనకు మాత్రమేనా, వాలంటీర్లకు ఉండవా అని ప్రశ్నించారు పవన్‌కల్యాణ్. ఉత్తరాంధ్రలో 151 మంది చిన్నారులు అదృశ్యమయ్యారన్నారు. శాంతిభద్రతలను, వ్యవస్థను కాపాడే బాధ్యత పోలీసులదేనని గుర్తుచేశారు. వారు పని చేయకుండా ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు వారి చేతులను కట్టేస్తున్నారన్నారని ఆరోపించారు పవన్.
Published on: Aug 12, 2023 05:56 PM
వైరల్ వీడియోలు
Latest Videos