Bandi Sanjay: గరీబీ హఠావో మంచి పథకమే.. ప్రధాని మోడీ లక్ష్యం అదే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రభుత్వం సాధించిన విజయాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సోమవారం ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇందిరాగాంధీ ‘‘గరీబీ హఠావో’’ నినాదాన్ని అమలు చేస్తోందంటూ పేర్కొన్నారు.

Bandi Sanjay: గరీబీ హఠావో మంచి పథకమే.. ప్రధాని మోడీ లక్ష్యం అదే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..
Bandi Sanjay
Follow us

|

Updated on: May 29, 2023 | 1:06 PM

నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 9 ఏళ్లు పూర్తయిన విషయం తెలిసిందే.. మే 26, 2014న తొలిసారిగా నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 30, 2019న రెండోసారి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రెండు సార్లు అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రభుత్వం సాధించిన విజయాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సోమవారం ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇందిరాగాంధీ ‘‘గరీబీ హఠావో’’ నినాదాన్ని అమలు చేస్తోందంటూ పేర్కొన్నారు. టాయిలెట్ల నిర్మాణం, రేషన్, ఇండ్ల నిర్మాణం వంటి మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు.

గతంలో రూపాయి పంపిస్తే.. లబ్దిదారులకు 15 పైసలే అందేవని.. అవినీతి జరుగుతోందన్న విషయాన్ని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా అంగీకరించారంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. అందుకే డీబీటీ విధానంతో అవినీతికి తావులేకుండా మోదీ ప్రభుత్వం ప్రతీ లబ్దిదారుడికి అందజేస్తుందన్నారు. ‘‘మహాజన్ సంపర్క్ అభియాన్’’ పేరుతో దేశ ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ప్రజల్లోకి వెళుతున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తరువాత అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యమని సంజయ్ పేర్కొన్నారు. గత పాలనలోని మంచి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత మోడీదేనన్నారు. గతంలో ఇందిరాగాంధీ హయాంలో ‘‘గరీబీ హఠావో’’ నినాదం మంచిదే.. ఆ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారో తెలుసుకుని.. మంచి ఉద్దేశంతో టాయిలెట్ల నిర్మాణం, రేషన్ బియ్యం అందజేత సహా పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

అవినీతిని ద్రుష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ డీబీటీ విధానంతో లబ్దిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తున్నారంటూ బండి సంజయ్ కొనియాడారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..