Telangana: తెలంగాణలో ఆ పార్టీదే అధికారం.. ప్రముఖ జ్యోతిష్కుడి సంచలన ప్రకటన..

అతనొక జ్యోతిష్కుడు.. అంతకుముందు పలు విషయాల గురించి జోస్యం చెప్పాడు.. కొన్ని సందర్భాల్లో ఆ అంచనాలు నిజమయ్యాయి.. ఈ క్రమంలోనే రాజకీయాల గురించి అంచనా వేశాడు.. అది కూడా నిజమైంది.. అయన చెప్పిన సంఖ్య, అంచనాతోనే ప్రధాన పార్టీ అధికారం చేపట్టింది..

Telangana: తెలంగాణలో ఆ పార్టీదే అధికారం.. ప్రముఖ జ్యోతిష్కుడి సంచలన ప్రకటన..
Telangana Politics
Follow us

|

Updated on: May 29, 2023 | 12:41 PM

అతనొక జ్యోతిష్కుడు.. అంతకుముందు పలు విషయాల గురించి జోస్యం చెప్పాడు.. కొన్ని సందర్భాల్లో ఆ అంచనాలు నిజమయ్యాయి.. ఈ క్రమంలోనే రాజకీయాల గురించి అంచనా వేశాడు.. అది కూడా నిజమైంది.. అయన చెప్పిన సంఖ్య, అంచనాతోనే ప్రధాన పార్టీ అధికారం చేపట్టింది.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేసింది.. ఈ క్రమంలోనే ఆయన మరో జోస్యం చెప్పారు.. తెలంగాణ ఎన్నికల్లో ఫలానా పార్టీ విజయం సాధిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కొన్ని నెలల ముందే కచ్చితత్వంతో అంచనా వేసిన ఆయన.. తెలంగాణ గురించి ప్రకటన చేయడం ఇప్పుడు రాజకీయాల్లో కలకలం రేపింది. అసలు ఆ జ్యోతిష్కుడు ఎవరు.. తెలంగాణలో అధికారం గురించి ఆయన అంచనా ఏంటీ..? కర్ణాటక గురించి ముందు ఏం చెప్పారు.. అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..

మరికొన్ని నెలల్లో.. అంటే డిసెంబర్ కల్లా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది చివరిలో జరగనున్న ఈ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ వైపు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య హోరాహోరి పోరు ఉండనుంది. ఎంఐఎం తోపాటు వామపక్ష పార్టీలు కూడా సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చండీగ‌ఢ్ కు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు రుద్ర కరణ్ పర్తాప్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో మళ్లీ కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రభుత్వమే వస్తుందంటూ జోస్యం చెప్పారు. ‘‘నమో రుద్రాయ.. రానున్న తెలంగాణా ఎన్నికలలో కె చంద్రశేఖర్ రావు ప్రభుత్వమే మళ్లీ ఎన్నికై.. తన పదవీకాలాన్ని కొనసాగిస్తుంది..’’ అంటూ రుద్ర కరణ్ పర్తాప్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఆస్ట్రాలజర్ రుద్ర కరణ్ పర్తాప్ జోస్యానికి అంతకుముందు నుంచి ప్రాధాన్యత ఉంది. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పర్తాప్.. ముందుగానే కచ్చితమైన అంచనాతో చెప్పారు. ఆయన కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు.. చివరగా ఆయన అంచనాలే నిజమయ్యాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ట్వీట్ చేసిన రుద్ర కరణ్ పర్తాప్.. మే నెల బీజేపీకి అనుకూలంగా లేదని.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు బీజేపీ కంటే కాంగ్రెస్‌కే అధికంగా ఉన్నాయనపతాకగ. ఆ తర్వాత.. 18 రోజులకు ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. కాంగ్రెస్ 123 నుంచి 133 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశారు.. ఆయన పేర్కొన్నట్లే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు అన్ని సీట్లే గెలుచుకోవడం గమనార్హం.

ఈ క్రమంలోనే.. ఆస్ట్రాలజర్ రుద్ర కరణ్ పర్తాప్ తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జోస్యం చెప్పడం.. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని చెప్పడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..