YS Sharmila: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేతో షర్మిల భేటి.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ..
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైయస్ షర్మిల మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు షర్మిల అభినందనలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో వైయస్‌ఆర్‌టీపీకి పొత్తు ఉండవచ్చనే ప్రచారం..
YS Sharmila: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైయస్ షర్మిల మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు షర్మిల అభినందనలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో వైయస్‌ఆర్‌టీపీకి పొత్తు ఉండవచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి కొన్ని నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున వారి మధ్య రాజకీయ పొత్తుల అంశంపై చర్చ జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. వీరి భేటి తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వారిద్దరూ భేటీ కావడం ఇది రెండోసారిగా తెలుస్తోంది. ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఆమె బెంగుళూరులో డీకే శివకుమార్‌ను ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. డీకే శివకుమార్ కుటుంబంతో షర్మిలకు చాలా ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
#WATCH | YS Sharmila, president of YSR Telangana Party met Karnataka Deputy CM DK Shivakumar in Bengaluru.
(Video: Office of DK Shivakumar) pic.twitter.com/JaNcfGnMu6
— ANI (@ANI) May 29, 2023
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రెడిట్ పూర్తిగా డీకే శివకుమార్‌కే దక్కుతుందని ఇటీవల షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సాటీపీ విలీనం అవుతుందని జరుగుతున్న ప్రచారాన్ని షర్మిల తోసిపుచ్చారు. ఇతర పార్టీల నుంచి పొత్తు ప్రతిపాదనలపై స్పందిస్తూ.. కొన్ని పార్టీల నేతల నుంచి తనకు మిస్డ్ కాల్స్ వస్తున్నట్లు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..