Bandi Sanjay: ఆ ప్రశ్నలకు జవాబు చెప్పండి.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ..
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతాంగం, రైతు సంఘాల నాయకులు నేరుగా, ఫోన్ల ద్వారా అనేక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని.. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని బండి సంజయ్ సీఎంకు రాసిన బహిరంగలేఖలో పేర్కొన్నారు.

Bandi Sanjay letter to CM KCR: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ బండి సంజయ్ మరోసారి విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత ప్రచారాల కోసం సీఎం, మంత్రులు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. 7500 కోట్లు రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేయాలని, 2018 ఎన్నికల హామీ ప్రకారం రైతు రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. బండి సంజయ్ గురువారం బహిరంగ లేఖ రాశారు. రైతుబంధు నిధులను వెంటనే రైతులఖాతాల్లో జమచేయాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతాంగం, రైతు సంఘాల నాయకులు నేరుగా, ఫోన్ల ద్వారా అనేక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని.. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని బండి సంజయ్ సీఎంకు రాసిన బహిరంగలేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు బండి సంజయ్.. పలు అంశాలను సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో ప్రాస్తావించారు.
‘‘ఫామ్‌హౌస్ సీఎం అయిన మీకు రైతుల కష్టాలు, కడగండ్లు పట్టవు. 8 ఏళ్ల మీ పాలన ‘రైతుల కంటకన్నీరు.. మీ ఫామ్‌హౌస్ పంట పన్నీరుగా తయారైంది’’ అంటూ బండి సంజయ్ విమర్శించారు. రైతుబంధు నిధులు విడుదల కాకపోవడం, పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం వంటి ప్రధాన సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారన్నారు. గత ఎన్నికల హామీ రూ.లక్ష రుణమాఫీ అమలు కాకపోవడంతో వడ్డీల మీద వడ్డీలు పెరిగి రైతుల ఆర్థిక పరిస్థితి చితికిపోయిందని వివరించారు. రైతుల సమస్యలను గాలికొదిలి దేశవ్యాప్తంగా మీ వ్యక్తిగత ప్రచారానికి, మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనకు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వీటన్నింటిపై ప్రజలకు జవాబు చెప్పాలని లేఖలో కోరారు.




7500 కోట్లు రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేయాలని, 2018 ఎన్నికల హామీ ప్రకారం రైతు రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి బహిరంగ లేఖ.@TelanganaCMO pic.twitter.com/vlpQsCRulk
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 9, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
