Jubilee Hills: హైదరాబాద్ రేసులో నిందితుల భారీ ప్లాన్.. పోలీసులకు చిక్కకుండా బిగ్ స్కెచ్.. ఏం చేశారో తెలిస్తే..

Jubilee Hills Case: జూబ్లిహిల్స్‌ మైనర్‌ బాలిక రేప్‌ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నిందితులు మైనర్లు కావడంతో ఈ అంశంలో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే నిందితుల్లో రాజకీయ...

Jubilee Hills: హైదరాబాద్ రేసులో నిందితుల భారీ ప్లాన్.. పోలీసులకు చిక్కకుండా బిగ్ స్కెచ్.. ఏం చేశారో తెలిస్తే..
Follow us

|

Updated on: Jun 10, 2022 | 11:02 AM

Jubilee Hills Case: జూబ్లిహిల్స్‌ మైనర్‌ బాలిక రేప్‌ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నిందితులు మైనర్లు కావడంతో ఈ అంశంలో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే నిందితుల్లో రాజకీయ నాయకుల కుమారులు ఉన్నారని తెలిసిందో ఈ సంఘటన కాస్త పొలిటికల్‌ యాంగిల్‌ తీసుకుంది. పోలీసులు కావాలనే నేరస్తులను తప్పిస్తున్నారని వార్తలు వచ్చిన క్రమంలో ఒక్కసారిగా కేసులో స్పీ్‌డ్‌ పెరిగింది. కేసును చేధించే క్రమంలో పోలీసులు దూకుడు పెంచారు. నిందితుల రిమాండ్‌ రిపోర్ట్‌లో సీన్‌ టు సీన్‌.. ఏం జరిగిందో కోర్టుకు తెలిపారు. కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. 14వ తేదీ వరకు నిందితులను పోలీసులు విచారించనున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేప్‌ చేసిన అనంతరం పోలీసులకు చిక్కకుండా నిందితులు వేసిన మాస్టర్‌ ప్లాన్‌ షాకింగ్‌కు గురి చేస్తోంది. అత్యాచారం చేసిన తర్వాత మూడు రోజుల పాటు బాధితురాలి కుటుంబంపై ఫోకస్‌ పెట్టారు. ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పారిపోవాలని మాస్టర్‌ ప్లాన్‌ వేసుకున్నారు. మే 31 వరకు వేచి చూసిన నిందితులు, 31న బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగానే హైదరాబాద్‌ను వదిలి వెళ్లారు. మొత్తం ముగ్గురు నిందితులు నగరం వదిలి వెళ్లిపోయారు. బంజారాహిల్స్‌లో నివాసం ఉండే ఒక నిందితుడు తమ కుటుంబంతో కలిసి తమిళనాడుకు పరార్‌ అయ్యాడు.

మరో నిందితుడు గోవాకు జంప్‌ అయ్యాడు. ఇక మూడో నిందితుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు పారిపోయాడు. దీంతో నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు మూడు రాష్ట్రాల సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలు పెట్టారు. నిందితులు తమ ఫోన్‌లను స్విఛ్‌ ఆఫ్‌ చేయడంతో నిందితుల కుటుంబ సభ్యులపై పోలీసులు ఫోకస్‌ పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, గోవాలకు ప్రత్యేక బృందాలను పంపించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!