Telangana BJP: తెలంగాణ బీజేపీలో పెరిగిన సినిమా గ్లామర్.. పొలిటికల్ హీట్ పెంచుతున్న స్టార్లు..
Movie Glamor in BJP: తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. రాజకీయాలకు సినిమాకు మధ్య విడదీయలేని సంబంధం ఎర్పడుతోంది. సినిమా హీరోలు సొంత పార్టీలు స్థాపించి ప్రజల్లోకి వెళ్లి రాజకీయాల్లో అత్యంత క్రియాశీల పాత్ర పోషిచడమే కాదు. ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వరకూ అందరూ సినీరంగం నుంచి వచ్చిన వారే.. వీరంతా సొంత పార్టీలు స్థాపించిన వారే.. దక్షిణ భారత్‌లో తమిళనాడు రాజకీయల తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ రాజకీయాలు తెలంగాణపై కనిపిస్తోంది.. టీఆర్‌ఎస్‌ని ఢీ కొట్టాలని బలంగా ప్లాన్ చేస్తోంది.. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడంలేదు బీజేపీ.
![Telangana BJP: తెలంగాణ బీజేపీలో పెరిగిన సినిమా గ్లామర్.. పొలిటికల్ హీట్ పెంచుతున్న స్టార్లు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/telangana-bjp.jpg?w=1280)
తెలంగాణ బీజేపీ సినీ గ్లామర్ తో మెరిసిపోవాలని భావిస్తోంది. ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. పార్టీ అగ్రనాయకులతో పరిచయాలున్న విజయశాంతి హాట్ హాట్ ట్విట్స్ చేస్తూ… పార్టీలో కాక పుట్టిస్తున్నారు. మరోనటి జీవితా రాజశేఖర్ బీజేపీలో కొనసాగుతున్నారు. ఇటీవల పార్టీ నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో భాగంగా వికారాబాద్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. వీరితో పాటు కవిత, మాధవిలత లాంటి నేతలు కూడా కాషాయ పార్టీలో తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. తాజాగా సహజనటి జయసుధ… కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. వచ్చే వారంలో కాషాయ పార్టీ కండువా కప్పుకోవడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సినీ గ్లామర్ తో పాటు క్రిష్టియన్ వర్గాన్ని ఆకర్షించడానికి జయసుధ చేరిక దోహదపడుతుందని తెలంగాణ కమలనాథులు లెక్కలు వేస్తున్నారు.
ఇప్పటికే సినీ నటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ ఆందోల్ నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. బీజేపీలో వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వీరే కాకుండా పరోక్షంగా తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది నటులు కాషాయ పార్టీతో టచ్ లో ఉన్నారు. హస్యనటుడు బ్రహ్మనందం… ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో తన మిత్రుడు బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరఫున ప్రచారం చేశారు. కోట శ్రీనివాస రావు ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు.
బీజేపీ అగ్రనేతలు తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రతీసందర్భంలో ప్రముఖులను కలిసి వెళ్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు.. ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. హైదరాబాద్ లో బీజేపీ అగ్రనేతలు పర్యటించిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ , నితీన్ లాంటి సినిమా హీరోలను కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసుకుంటున్నారు.
ఇక ప్రభాస్ కుటుంబం బీజేపీతో ఇప్పటికే టచ్ లో ఉంది. మొత్తానికి తెలంగాణ కమలనాథులు సినిమా వనరులను సద్వినియోగం చేసుకోవాలని లెక్కలు వేసుకుంటుంది. వంద రోజుల యాక్షన్ ప్లాన్ అంటున్న బీజేపికి సినిమా కలరింగ్ ఏ మాత్రం కలిసొస్తుందనేది చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం