Hyderabad Biryani: హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇంత రుచి ఎందుకబ్బా.. టేస్ట్ సీక్రెట్ ఇదే
ఇక హైదరాబాద్ బిర్యానీ చరిత్ర విషయానికొస్తే.. పర్షియన్‌లో బిరియన్ అంటే వేయించిన లేదా కాల్చిన అనే అర్థం. 1518, 1687 మధ్య హైదరాబాద్‌ను పాలించిన కుతుబ్ షాహీల ద్వారా బిర్యానీ పర్షియ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. అనంతరం 1930-50లలో పర్షియ నుంచి భారీగా వలసలు పెరగడం కూడా హైదరాబాద్‌లో బిర్యానీ కల్చర్ పెరగడానికి కారణంగా చెప్పొచ్చు. సాధారణంగా బిర్యానీని ఒక పెద్ద పాత్రలో వండుతారు. కింద వెడల్పుగా ఉండే పైన చిన్నగా ఉండే పాత్రలో బిర్యానీ చేస్తారు. పాత్రలో ఏర్పడే ఆవిరి ద్వారా బియ్యంతోపాటు, మాంసం ఉడుకుతుంది...
హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చే వాటిలో బిర్యానీ కూడా ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నిసార్లు తిన్నా మళ్లీ మళ్లీ తినాలనిపించడం బిర్యానీ ప్రత్యేకత. ఎక్కడ ఎన్ని బిర్యానీలున్నా హైదరాబాద్ బిర్యానీకి ఉండే బ్రాండే వేరు. అందుకే హైదరాబాద్ బిర్యానీ విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటుంది. బిర్యానీ చుట్టూ రోజు కోట్లలో వ్యాపారం జరుగుతుంటుంది. రుచిలో అమోఘంగా ఉండే హైదరాబాద్ బిర్యానీ ఎన్నో గుర్తింపులు దక్కించుకుంది. మొన్నటికి మొన్న ఆఫ్రికన్ జనరల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నివేదికలో తేలిన అంశాల ఆధారంగా..’హెల్తీఫుడ్‌గా హైదరాబాద్ బిర్యానీకి’ గుర్తింపు లభించింది. బిర్యానీ తయారీలో ఉపయోగించే పదార్థాలు దీనిని అంత రుచిగా మార్చేశాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఆరోగ్యానికి కూడా బిర్యానీ దోహద పడుతుందని ఈ నివేదికలో తేలింది.
ఇక హైదరాబాద్ బిర్యానీ చరిత్ర విషయానికొస్తే.. పర్షియన్‌లో బిరియన్ అంటే వేయించిన లేదా కాల్చిన అనే అర్థం. 1518, 1687 మధ్య హైదరాబాద్‌ను పాలించిన కుతుబ్ షాహీల ద్వారా బిర్యానీ పర్షియ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. అనంతరం 1930-50లలో పర్షియ నుంచి భారీగా వలసలు పెరగడం కూడా హైదరాబాద్‌లో బిర్యానీ కల్చర్ పెరగడానికి కారణంగా చెప్పొచ్చు. సాధారణంగా బిర్యానీని ఒక పెద్ద పాత్రలో వండుతారు. కింద వెడల్పుగా ఉండి, పైన చిన్నగా ఉండే పాత్రలో బిర్యానీ చేస్తారు. పాత్రలో ఏర్పడే ఆవిరి ద్వారా బియ్యంతోపాటు, మాంసం ఉడుకుతుంది. పాత్రపై బోర్లించిన మూతపై మండుతున్న బొగ్గును పోస్తారు. దీని ద్వారా అన్నివైపులా సమానంగా వేడి అందుతుంది.
హైదరాబాద్ బిర్యానీకి ఎందుకింత ప్రత్యేకత..
పర్షియన్ భాషలో బిరియన్ అంటే వేయించిన లేదా కాల్చిన అని అర్థం. పాత్ర దిగువన ఉన్న మాంసం ముక్కలు అధిక వేడి కారణంగా పాక్షిక్షంగా కాలుతాయి. అయితే కోల్‌కతా, అంబూర్, తలస్సేరి బిర్యానీలను నీటితో వండుతారు. ఈ కారణంగానే ఈ విధానంలో మాంసాన్ని కాల్చడం ఉండదు. బిర్యానీని వండడానికి ప్రత్యేక పాత్రను ఉపయోగిస్తారు. దీనిని బిర్యానీ దేఘ్ అంటారు. పాత్ర కింద విశాలంగా పైకి సన్నగా ఉండడం ఈ పాత్ర ప్రత్యేకత. హైదరాబాద్ బిర్యానీలో మాత్రమే పచ్చి మాసం, బియ్యాన్ని కలిపి వండుతారు. మాంసాన్ని విడిగా ఉడికించి బియ్యంలో కలిపితే దానిని పక్కి బిర్యానీగా పిలుస్తారు. పర్షియన్ భాషలో దమ్ అంటే శ్వాస లేదా ఆవిరి అనే అర్థం. పాత్రలోని ఆవిరి బయటకు పోకుండా మూతను పిండితో సీల్ చేస్తారు. మాసంతోపాటు, బియ్యం ఆవిరిపై ఉడుకుతుంది కాబట్టి దీనిని దమ్ బిర్యానీ అంటారు. కుంకుమపువ్వు, పాలు, నెయ్యితో కలిపి చేసే బిర్యానీని జాఫ్రానీ బిర్యానీ అంటారు.
బిర్యానీ లెక్కలు..
హైదరాబాదీలకు బిర్యానీ అంటే ఎంత ఇష్టమో ఈ లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది. హైదరాబాద్‌లో ప్రతీ రోజూ ఏకంగా 3 లక్షలకు పైగా బిర్యానీ ప్లేట్స్ అమ్ముడు పోతున్నాయి. బిర్యానీ కారణంగా తెలంగాణలో ఏటా మాంసం ఉత్పత్తి భారీగా పెరుగుతోంది. కేవలం చికెన్‌కు మాత్రమే పరిమితం కాకుండా మటన్ బిర్యానీ అమ్మకాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. 2014లో తెలంగాణలో 5.42 లక్షల టన్నుల మాసం విక్రయాలు జరిగాయి. 2021-22లో ఈ సంఖ్య ఏకంగా 10.04 లక్షల టన్నులకు చేరింది. 2019లో తెలంగాణలో జరిగిన మొత్తం మాంసం విక్రయాలు రూ. 11,426 కోట్లుకాగా, ఇందులో కేవలం చికెన్ అమ్మకాలు ఏకంగా రూ. 6,476 కోట్లుగా ఉంది. హైదరాబాద్‌లో చెంగిచెర్ల, అంబర్‌పేట, బోయిగూడ, జియాగూడలో ఉన్న కబేళాలలో సాధారణంగా రోజుకు 15,000 మేకలు, గొర్రెలు ప్రాసెస్ చేస్తున్నారు. ఆదివారం ఈ సంఖ్య ఏకంగా 40,000కి చేరడం విశేషం.
ఆన్‌లైన్‌లో బిర్యానీ హవా..
ప్రపంచవ్యాప్తంగా 80 రకాల బిర్యానీలు ఉన్నా మన హైదరాబాద్ బిర్యానికి ఉండే క్రేజే వేరు. అందుకే ఆన్‌లైన్ ఫుడ్ యాప్స్‌లోనూ బిర్యానీకి భలే గిరాకీ ఉంటుంది. గతేడాది ఆన్‌లైన్ ఆర్డర్స్‌లో బిర్యానీ టాప్ ప్లేస్‌లో నిలవడమే దీనికి నిదర్శనం. స్విగ్గీ 2022కి గాను ‘అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకం’గా ప్రకటించింది. తమ వార్షిక ట్రెండ్స్‌కు సంబంధించిన నివేదిక హౌ ఇండియా స్విగ్గీ 2022 ఎడిషన్లో ఈ వార్తను ప్రచురించింది. ఏకంగా నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ అయ్యాయి. అంటే సెకనుకు 2.28 ఆర్డర్లు జరుగుతున్నాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు బిర్యానీ అమ్మకాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..