AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మానవత్వం ఇంకా మిగిలే ఉంది.. ఇలాంటి తాతయ్యలు నూటికో కోటికో ఒక్కరే

81 ఏళ్ల వయసులో శరీరం కొంత సహకరించకపోయినా సేవ చేయాలన్న మనసు మాత్రం యవ్వనంతో సమానం. తెల్లవారుజామునే లేచి తాజా పాలు తెప్పించుకుంటారు. బిస్కెట్ల ప్యాకెట్లు సిద్ధం చేస్తారు. ఆసుపత్రి సమీపంలోని ఆయన ఇంటి చుట్టూ రోగులు, అటెండెంట్ల ముఖాల్లో చిరునవ్వులు కన్పిస్తాయి. సారూ వచ్చారు.. ఇవాళ కూడా..

మానవత్వం ఇంకా మిగిలే ఉంది.. ఇలాంటి తాతయ్యలు నూటికో కోటికో ఒక్కరే
G Sampath Kumar
| Edited By: |

Updated on: Nov 26, 2025 | 1:43 PM

Share

పల్లె వాతావరణంలో నిండైన మమకారంతో పెరిగిన మనిషి హృదయం ఎంత పెద్దదిగా ఉంటుందో పెద్ద పల్లి జిల్లా మంథనికి చెందిన 81 ఏళ్ల వసంతశర్మ చూస్తే తెలుస్తుంది. తెలుగు ఉపాధ్యాయుడిగా ఎన్నో తరాలకు విద్యాబోధన చేసిన ఆయన, ఉద్యోగవిరమణ అనంతరం కూడా సేవనే తన సంపూర్ణ జీవన విధానంగా ఎంచుకున్నారు. 2002లో రిటైర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అంటే ఇరవై ఏళ్లకు పైగా ప్రతి రోజూ ఉదయం తన ఇంటికి సమీపంలో ఉన్న మంథని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు, వారి బంధువులకు ఉచితంగా పాలు, బిస్కెట్లు అందిస్తున్నారు.

రోజు ఉదయం ఆ సేవకే శ్రీకారం

81 ఏళ్ల వయసులో శరీరం కొంత సహకరించకపోయినా సేవ చేయాలన్న మనసు మాత్రం యవ్వనంతో సమానం. తెల్లవారుజామునే లేచి తాజా పాలు తెప్పించుకుంటారు. బిస్కెట్ల ప్యాకెట్లు సిద్ధం చేస్తారు. ఆసుపత్రి సమీపంలోని ఆయన ఇంటి చుట్టూ రోగులు, అటెండెంట్ల ముఖాల్లో చిరునవ్వులు కన్పిస్తాయి. సారూ వచ్చారు.. ఇవాళ కూడా పాలు అందిస్తారు.. అని అక్కడి సిబ్బంది నుంచి రోగులదాకా అందరూ ఆనందిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Auto News: ఈ 5 బైక్‌లు యాక్టివా ధర కంటే తక్కువే.. మైలేజీ లీటరుకు 73 కి.మీ!

పింఛన్‌లో సగమే సేవకు..

తన చిన్ననాటి నుంచి మనుషులకు సహాయం చేయడం ఆనందమని భావించిన శర్మ.. ఇప్పటికీ నెలకు సుమారు రూ.20 వేల వరకు ఈ సేవకే వెచ్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో ఉన్నవాళ్లెవరూ తమ ఇళ్లలోని సౌకర్యాల నుంచి వచ్చిన వారే కాదు. బాధలో ఉన్న వారికి తాగడానికి ఒక్క గ్లాస్ పాలు అందితే.. నాకు అంతకన్నా ఆనందం ఏముంటుంది? అని ప్రశాంతంగా స్పందిస్తారు. గ్రామం గర్వించుకునే వ్యక్తి వసంతశర్మ గారి సేవలను చూసి గ్రామ ప్రజలే కాదు. ఆసుపత్రి సిబ్బంది కూడా ఆయనను ‘మంథని మదర్ థెరిసా’గా పిలుచుకునేంతగా గౌరవిస్తున్నారు.

సేవకు వయస్సే అడ్డంకి కాదని రుజువు:

వసంతశర్మ జీవితం చెబుతున్న సందేశం ఒక్కటే. సేవ మనసులో ఉంటే వయస్సు, ఆరోగ్యం, ఆర్ధిక పరిస్థితి ఏదీ అడ్డురాదు. పింఛన్‌లో సగం దానం చేస్తూ, శారీరకంగా నిత్యం సేవ చేస్తూ ఆయన చూపుతున్న మానవత్వం నిజంగా నేటి తరానికి ఒక గొప్ప పాఠం.

దీనికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి:

Follow Us