Inspiring Story: అంధుడు పట్టుదలతో చదివి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.. తోడుగా వెనుక ఉండి నడిపిస్తున్న భార్య

కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటారు కళ్లు కనపడక పోయినా...జీవితమే ఒక అంధకారం అయినప్పటికీ పట్టుదలతో చదువుకుని చీకటి జీవితం నుంచి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయ్యాడు ఒక యువకుడు.

Inspiring Story: అంధుడు పట్టుదలతో చదివి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.. తోడుగా వెనుక ఉండి నడిపిస్తున్న భార్య
Inspiring Story
Follow us
N Narayana Rao

| Edited By: Surya Kala

Updated on: Nov 16, 2024 | 8:54 PM

కళ్లు కనపడక పోయినా.. అంధుడైన ఆ యువకుడు కష్టపడి చదువుకుని DSC తో టీచర్ ఉద్యోగం సాధించాడు. అంతేకాదు ఎందరో యువతకు ఆదర్శంగా కూడా నిలిచాడు. ఖమ్మం జిల్లా ముట్టగూడెం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు పుట్టుకతోనే చూపును కోల్పోయాడు. 80% అంధుడైన నవీన్ తన జీవితం చీకటి అయ్యిందని కుంగి పోలేదు. అందరిలా దేవుడిని నిందించలేదు. అంధకారంలో జీవిస్తూనే… కళ్ళు లేక పోయినా మనసుతో బాహ్య ప్రపంచాన్ని చూడటం ప్రారంభించాడు. కళ్ళు ఉండి కూడా చీకటిలో బ్రతుకుతున్న కొందరిలా కాకుండా.. ఎలాగైనా జీవితంలో విద్యతోనే గెలవాలని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఉన్నత విద్యతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని సంకల్పించుకున్నాడు.

అంతే తాను అనుకున్న లక్ష్యాన్ని 2024 డీఎస్సీ లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యాడు. తన భార్య అన్ని విధాలుగా వెనక ఉండి సపోర్టు చేయడంతో.. పట్టుదలతో అనుకున్నది సాధించాడు. ఇంట్లో భార్య లెస్సన్స్, బుక్స్ చదివి వినిపిస్తూ నోట్స్ రాస్తూ ఉండేది. అవి చెవులతో విని గుర్తు పెట్టుకునే వాడు. ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగం సాధించి చీకటిని జయించాడు.

ఇవి కూడా చదవండి

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొత్తగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. 6,7,8 తరగతులకు అందరూ ఉపాధ్యాయుల మాదిరిగానే అనర్గళంగా పాఠాలు కూడా బోధిస్తున్నాడు. అంధుడైన పోటీ పరీక్షలు రాసి వికలాంగుడు కేటగిరిలో ఉద్యోగం సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. కృషి పట్టుదల ఉంటే అంగవైకల్యం అడ్డు కాదని, కళ్ళు కనపడక జీవితం చీకటి అయ్యిందేమో…కానీ చదువు అనేది నాలాంటి జీవితానికి వెలుగులు నింపిందని, చూడటానికి కళ్ళు ఉన్నప్పటికీ కొందరు చదువు ను నిర్లక్ష్యం చేస్తూ జీవితాలను పాడు చేసుకుంటున్న యువతకు కళ్ళు లేకపోయినా కష్టపడి చదువుకుని ప్రభుత్వ టీచర్ జాబ్ సంపాదించి ఆదర్శంగా నిలవాలినేది తన లక్ష్యమని ఆ అందుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నవీన్ అంటున్నాడు.

ఏది ఏమైనా పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించిన నవీన్ చీకటి జీవితం.. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ స్థానికులు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ప్రతి రోజూ భార్య కూడా అతనితో పాటు స్కూలు కి వస్తూ.. క్లాస్ లో బోధించే ముందు.. నవీన్ కు ముందుగానే లెసన్స్ చెబుతుంది. వాటిని విని గుర్తు పెట్టుకొని విద్యార్థులకు బోధిస్తున్నాడు. ఇలా భర్త విజయం లో ప్రతి అడుగులో ప్రతి క్షణం తోడు ఉంటూ భార్య ముందుకు నడిపించడంతో పది మందికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. చూపు కనపడకపోయినా పిల్లలకు పాఠాలు ఎలా భోధిస్తున్నాడు అని ఆశ్చర్యంగా చూసేందుకు గ్రామస్థులు వస్తుండటం విశేషం. ఎలాంటి బెరుకు లేకుండా అనర్గళంగా పిల్లలకు ఆ బ్లైండ్ టీచర్ బోధించే తీరు చూసి ప్రశంసిస్తున్నారు స్థానికులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..