హఠాత్తుగా బరువు తగ్గుతున్న అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్ .. నాసా ఆందోళన.. రీజన్ ఏమిటంటే

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ బరువు వేగంగా తగ్గుతోంది. దీంతో నాసా వైద్యులు ఆందోళన చెందుతున్నారు. సునీతా బరువు ఎందుకు తగ్గుతోందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఓ రిపోర్టు తయారు చేస్తోంది. అయితే నాసా .. సునీతా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అధిక కేలరీల ఆహారం, వ్యాయామ ప్రణాళికలపై పనిచేస్తోంది.

హఠాత్తుగా బరువు తగ్గుతున్న అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్ .. నాసా ఆందోళన.. రీజన్ ఏమిటంటే
Astronaut Sunita WilliamsImage Credit source: NASA
Follow us
Surya Kala

|

Updated on: Nov 16, 2024 | 7:11 PM

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ వేగంగా బరువు తగ్గడం నాసా వైద్యులకు కొత్త సవాలుగా మారింది. జూన్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కి చేరుకున్నప్పటి నుంచి సునితా బరువు నిరంతరం తగ్గుతూ వచ్చింది. ఇది వైద్యులకు ఆందోళన కలిగించే విషయంగా మారింది. అమెరికన్ న్యూయార్క్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం సునీతా బరువును సాధారణ స్థాయికి తీసుకురావడానికి నాసా నిపుణులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన చిత్రాలలో సునీతా విలియమ్స్ స్లిమ్ లుక్‌ను చూసిన నిపుణులు ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. వెంటనే అప్రమత్తం అయ్యారు. నివేదిక ప్రకారం సునీత బరువు గణనీయంగా తగ్గిందని.. ఇప్పుడు ఆమె చాలా సన్నగా ఉందని నాసా అధికారి తెలిపారు. ఈ పరిస్థితిలో సునీతా బరువును సాధారణ స్టేజ్ కు చేరుకునేలా చేయడానికి తమ ప్రాధాన్యత అని అధికారి చెప్పారు.

మిషన్ సమయం ఎందుకు పెరిగిందంటే

నాసాకు చెందిన సైంటిస్టులు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌లు కలిసి ఈ ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా అంతరిక్షంలోకి అడుగు పెట్టారు. మొదట్లో ఈ మిషన్ ఎనిమిది రోజులు మాత్రమే షెడ్యూల్ చేయబడింది అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వీరు అంతరిక్షంలో ఉండాల్సిన సమయం పొడిగించబడింది. ఈ సమయంలో చాలా కాలం పాటు అంతరిక్షంలో చిక్కుకోవడం వల్ల సునీతా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు వారి అంతరిక్ష యాత్ర ఎనిమిది నెలల పాటు పొడిగించబడింది. వీరు భూమికి తిరిగి రావడం ఫిబ్రవరి 2025 నాటికి మాత్రమే సాధ్యమవుతుందని నాసా వెల్లడించింది. దీంతో ఇప్పుడు నాసా సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ల ఆరోగ్య పరిస్థితిని కాపాడంపై పూర్తి శ్రద్ధ చూపిస్తోంది.

ఇవి కూడా చదవండి

అంతరిక్షంలో బరువు తగ్గడానికి కారణాలు

అంతరిక్షంలో బరువు తగ్గడం అనేది ఒక సాధారణ దృగ్విషయం. ముఖ్యంగా సుదీర్ఘ మిషన్లలో.. నివేదిక ప్రకారం భూమిపై నివసించే వారి కంటే వ్యోమగాములకు ఎక్కువ కేలరీలు అవసరమవుతాయి. మిషన్ ప్రారంభంలో.. సునీతా విలియమ్స్ బరువు 63.5 కిలోలు..ఆమె ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు. అయితే ఇప్పుడు అంతరిక్షంలో వీరికి అందుబాటులో ఉన్న అధిక కేలరీల ఆహారం కూడా వారి అవసరాలను తీర్చలేకపోతున్నట్లు తెలుస్తోంది.

అంతరిక్షంలో మానవ శరీరం జీవక్రియ వేగవంతం అవుతుంది. దీని వలన వారికి ఎక్కువ కేలరీలు అవసరమవుతాయి. ఒక సాధారణ వ్యోమగామి ప్రతిరోజూ 3500 నుంచి 4000 కేలరీలు తీసుకోవాలి. తద్వారా హ్యోమగామి బరువు స్థిరంగా ఉంటుందని నాసా నిపుణులు అంటున్నారు. అంతేకాదు జీరో గ్రావిటీలో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ సుమారు రెండు గంటల వ్యాయామం కూడా అవసరం. ఇది కేలరీలను బర్న్ చేస్తుంది. బరువును తగ్గిస్తుంది.

సునీతా విలియమ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

సునీత ఆరోగ్యంపై నాసా వైద్యులు నెల రోజుల క్రితమే దృష్టి సారించారు. తద్వారా ఆమె ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవచ్చు. సునీత రోజుకు 5000 కేలరీల వరకు తినాలని సూచించినట్లు తెలుస్తోంది. తద్వారా ఆమె శరీరానికి.. శక్తి అవసరాలను తీర్చవచ్చు. ఆమె బరువు సమతుల్యంగా ఉంటుంది.

అనేక NASA అధ్యయనాలు ద్వారా అంతరిక్ష ప్రయాణ ప్రభావం మహిళలపై మరింత ప్రతికూలంగా ఉందని తేలింది. 2023 అధ్యయనం ప్రకారం పురుషుల కంటే స్త్రీలు అంతరిక్ష ప్రయాణంలో ఎక్కువ కండరాలను కోల్పోతారు. ఈ కారణంగా మహిళా వ్యోమగాములు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..