- Telugu News Photo Gallery Skincare Tips for Winter: The Magic of Aloe Vera Gel In The Winters follow these tips
Winter Skin Cre Tips: కలబంద ను ఇలా అప్లై చేయండి.. శీతాకాలంలో మెరిసే స్కిన్ మీ సొంతం..
చలికాలంలో చర్మం పొడిబారడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో చర్మంలో తేమ ఉండడానికి రసాయన క్రీమ్స్ కంటే సహజమైన అలోవెరా జెల్ ను ఉపయోగించవచ్చు. అయితే దీనిని ఉపయోగించే పద్ధతుల గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Updated on: Nov 16, 2024 | 5:10 PM

చలికాలంలో మన చర్మంలో అనేక మార్పులు సంభవిస్తాయి. చలికాలంలో చర్మం పొడిబారుతుంది. దీని వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల చర్మాన్ని తేమగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా చలికాలంలో చర్మ సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. మెరిసే చర్మం కోసం సరైన చర్మ సంరక్షణ దినచర్యతో పాటు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

చల్లని వాతావరణంలో చర్మంలో తేమను కాపాడుకోవడానికి అలోవెరా జెల్‌ను అప్లై చేయవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. అందువల్ల కలబంద ను ఉపయోగించడం వలన చర్మ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే చలికాలంలో అలోవెరా జెల్‌ను ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకోవాలి. కలబంద గుజ్జులో ఏమి కలపడం వలన మెరిసే చర్మం మీ సొంతం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం నూనె కలబంద: కలబంద గుజ్జులో బాదం నూనెను కలిపి ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల డార్క్ స్పాట్స్ తగ్గుతాయి. బాదం నూనెలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉన్నాయి, ఇది చర్మం మెరిసేలా చేస్తుంది. బాదం నూనెను కొద్దిగా అలోవెరా జెల్‌లో కలిపి నిద్రపోయే ముందు అప్లై చేయాలి. దీని వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.

కొబ్బరి నూనె కలబంద : అలోవెరా జెల్, కొబ్బరి నూనె కూడా మెరిసే చర్మానికి మేలు చేస్తాయి. కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ ఇతో పాటు అనేక ఖనిజాలు ఉన్నాయి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం పొడిబారదు. దీన్ని మెడ , చేతులు , కాళ్ళకు కూడా అప్లై చేయవచ్చు.

కలబంద పసుపు: అలోవెరా జెల్‌లో పసుపు కలిపి ముఖానికి రాసుకోవచ్చు. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దీన్ని అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోవడమే కాకుండా ఇన్‌ఫెక్షన్‌ను దూరం చేస్తుంది. స్నానానికి ముందు అలోవెరా జెల్‌లో చిటికెడు పసుపు కలిపి అప్లై చేయవచ్చు. ఈ మిశ్రమాన్ని కనీసం 10 నిమిషాలపాటు అలాగే ఉంచాలి.

అయితే అలోవెరా జెల్‌తో ఎలాంటి ప్రయోగాలు చేసే ముందు, చర్మానికి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమం టెస్ట్ చేయడం వలన చర్మానికి సరైనదా కాదా అని ఇది మీకు తెలియజేస్తుంది.




