AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: రామ మందిరాన్ని పేల్చేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపు.. అయోధ్యలో హై అలర్ట్

అయోధ్యలో రామ మందిరాన్ని పేల్చివేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ బెదిరిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు శనివారం ఆలయం లోపల రూట్ మార్చ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆలయం లోపల, వెలుపల ఏర్పాట్లపై సమీక్షించారు. దీంతో పాటు అయోధ్యలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లోని వాహనాల తనిఖీలను పెంచారు.

Ayodhya: రామ మందిరాన్ని పేల్చేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపు.. అయోధ్యలో హై అలర్ట్
Khalistani Terrorist Pannu
Surya Kala
|

Updated on: Nov 16, 2024 | 5:37 PM

Share

అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. నవంబర్ 16, 17 తేదీల్లో అయోధ్యలో పేలుళ్లు జరగనున్నాయని ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో ఆలయ భద్రతను పెంచారు. శనివారం మధ్యాహ్నం భద్రతా సంస్థలు ఆలయం లోపల, వెలుపల రూట్ మార్చ్ నిర్వహించాయి. ఈ రూట్ మార్చ్‌లో సిఆర్‌పిఎఫ్, పిఎసి, స్థానిక పోలీసులతో పాటు ఆలయం లోపల ఉన్న భద్రతా దళాలను చేర్చారు. రామమందిరం భద్రతలో నిమగ్నమైన అధికారులు మాట్లాడుతూ ఆలయ సముదాయం మొత్తం ఇప్పటికే దుర్భేద్యమైన కోటగా ఉందని చెప్పారు.

అయోధ్య రామ మందిరం పేల్చివేస్తాం అని ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను హెచ్చరిక తర్వాత.. రామాలయం లోపల, వెలుపల భద్రతను సమీక్షించారు. రూట్ మార్చ్ ద్వారా ఆలయ ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను పర్యవేక్షించారు. అంతేకాదు భద్రతకు సంబంధించిన ఇతర అంశాలను పరిశీలించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రతా సమీక్ష సందర్భంగా అన్ని పాయింట్ల వద్ద భద్రతా ఏర్పాట్లు మరింత ఎక్కువ చేశారు. భద్రతా దళం మరింత అప్రమత్తం అయ్యాయి. దీని తర్వాత కమాండెంట్ టెంపుల్ సెక్యూరిటీతో పాటు ఏటీఎస్, సీఆర్పీఎఫ్, పీఏసీ సిబ్బంది సంయుక్తంగా రూట్ మార్చ్ నిర్వహించారు.

రూట్ మార్చ్‌లో భద్రతా ఏర్పాట్లు

ఈ క్రమంలో అయోధ్య పోలీసులు ఆలయం వెలుపల భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. ముఖ్యంగా అయోధ్యలోకి ప్రవేశించే అన్ని మార్గాలతో పాటు రామజన్మభూమి కాంప్లెక్స్‌కు వెళ్లే రహదారిపై పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్, మాన్యువల్ నిఘా స్థితిగతులను పరిశీలించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి చోటా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలావుండగా అయోధ్యలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. దీంతో పాటు బాంబ్, డాగ్ స్క్వాడ్‌లను కూడా అలర్ట్ మోడ్‌లో ఉంచారు.

ఇవి కూడా చదవండి

పన్ను బెదిరింపు వీడియోను విడుదల

ఇటీవల ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు ఫర్ జస్టిస్ ఆర్గనైజేషన్ అధినేత పన్నూ రామమందిరాన్ని పేల్చివేస్తామని బెదిరిస్తూ రిలీజ్ చేశాడు. నవంబర్ 16, 17 తేదీల్లో అయోధ్యలో వరుస బాంబు పేలుళ్లు జరుగుతాయని చెప్పాడు. ఈ బెదిరింపుకు సంబంధించిన వీడియోను కూడా పన్ను విడుదల చేశాడు. మరోవైపు ఆలయ భద్రతకు సంబంధించిన ఏజెన్సీలు ఆలయ భద్రతలో అనేక పొరలు ఉన్నాయని పేర్కొన్నారు. అటువంటి పరిస్థితిలో భూమి నుంచి లేదా ఆకాశం నుంచి కూడా ఆలయంపై దాడి చేసినా అది సక్సెస్ కాదని చెప్పారు. ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తే దాడికి ముందే పట్టుబడేంత పటిష్టమైన భద్రతా వ్యవస్థను అయోధ్యలో ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..