NPS: ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌లో నెలకు రూ.1.5 లక్షల పెన్షన్ కావాలంటే ఏం చేయాలి?

NPS: ఎన్‌పీఎస్‌ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ద్వారా నిర్వహిస్తారు. యాన్యుటీని కొనుగోలు చేయడానికి మీరు NPS ఫండ్‌లో 40 శాతం ఉపయోగించాలి. ఇది కాకుండా, మీరు మిగిలిన 60 శాతం మొత్తాన్ని ఒకేసారి..

NPS: ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌లో నెలకు రూ.1.5 లక్షల పెన్షన్ కావాలంటే ఏం చేయాలి?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 16, 2024 | 7:38 PM

ఉద్యోగం చేయడంతో పాటు భవిష్యత్తును భద్రపరచుకోవాలనే టెన్షన్ మనకు ఉంటుంది. ఇది కాకుండా పదవీ విరమణ తర్వాత ఖర్చుల గురించి కూడా టెన్షన్ పడుతుంటారు. అటువంటి పరిస్థితిలో మీరు పదవీ విరమణ తర్వాత కూడా పెన్షన్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీరు నెలకు రూ.1 లక్ష, రూ.1.5 లక్షలు ఆపైన పెన్షన్ అందుకోవచ్చు. అయితే, ఒక 25 ఏళ్ల వ్యక్తి తన పదవీ విరమణ తర్వాత నెలకు రూ.1.5 లక్షల పెన్షన్ తీసుకోవాలంటే నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఇప్పటి నుంచి ఎంత పెట్టుబడి పెట్టాలి? 35 ఏళ్ల పాటు ఇందులో పెట్టుబడి పెడుతూ ఉండాలి. రిటైర్మెంట్ కార్పస్ రూ.6.75 లక్షలు అయ్యేలా ప్లాన్ చేసుకుంటే నెలకు రూ.1.5 లక్షల పింఛన్ అందుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌లో వచ్చే రాబడి మొత్తంలో నుంచి 40 శాతం యాన్యుటీ ప్లాన్ అంటే పెన్షన్ కోసం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిడీ ఆధ్వర్యంలోని యాన్యూటీ సర్వీసుల్లో ఇన్వెస్ట్ చేయాలి. మిగిలిన 60 శాతం ఫండ్ మీరు ఎలాంటి ట్యాక్స్ లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చు.

మీ వయసు 25 ఏళ్లు ఉన్నప్పుడు మీరు ఎన్‌పీఎస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేశారని అనుకుందాం.. మీకు 60 సంవత్సరాలు వచ్చాక నెలకు రూ.1.5 లక్షలు పెన్షన్ కావాలి. అప్పుడు మీరు 25 ఏళ్ల నుంచి నెలకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి పెట్టాలి. ఇలా పదవి విరమణ వరకు అంటే మరో 35 ఏళ్ల వరకు కొనసాగించాల్సి ఉంటుంది. మీ పెట్టుబడిపై సగటున వార్షిక రిటర్న్స్ 12 శాతం చొప్పున వస్తుందని అంచనా వేస్తే మీరు అనుకున్న పెన్షన్‌ పొందవచ్చు. మొత్తం రూ.25.2 లక్షలు అవుతుంది. మీ మెచ్యూరిటీ వాల్యూ రూ.6.74 లక్షల వరకు ఉంటుంది. అందులో 40 శాతం అంటే రూ.2.7 కోట్లు యాన్యూటీ ప్లాన్ కొనుగోలు చేయాలి. మిగిలిన రూ.4.04 లక్షలు విత్ డ్రా చేసుకోవచ్చు. అప్పుడు మీకు నెలకు రూ.1.48 లక్షల వరకు పెన్షన్ అందుతుంది. అయితే, మీకు వచ్చే రిటర్న్స్, మీ యాన్యూటీ ప్లాన్ ఆధారంగా మీ పెన్షన్ అనేది ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.

NPSలో పన్ను ప్రయోజనాలు

ఇవి కూడా చదవండి

ఎన్‌పీఎస్‌ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ద్వారా నిర్వహిస్తారు. యాన్యుటీని కొనుగోలు చేయడానికి మీరు NPS ఫండ్‌లో 40 శాతం ఉపయోగించాలి. ఇది కాకుండా, మీరు మిగిలిన 60 శాతం మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏకమొత్తం ఉపసంహరణ పూర్తిగా పన్ను రహితం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇది కాకుండా, మీరు సెక్షన్ 80CCD (1B) కింద రూ. 50,000 వరకు వార్షిక పెట్టుబడిపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: BSNL: జియో కంటే మరింత తక్కువ.. 70 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ బెస్ట్‌ ప్లాన్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!