Sabudana Makhana Kheer: మఖానాతో కూడా ఖీర్ చేయవచ్చు.. తక్కువ సమయంలో టేస్టీగా సుగ్గుబియ్యం మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
లోటస్ సీడ్ పఫ్స్ లేదా ఫాక్స్ నట్స్‌తో తయారు చేసే భారతీయ డెజర్ట్ మఖానా ఖీర్. సాంప్రదాయ ఉత్తర భారత సాంప్రదాయ డెజర్ట్ వంటకం ఇది. దీనిని ఉత్తర భారతదేశంలో పండుగలు, ఉపవాసాల సమయంలో ఎక్కువగా ప్రసాదంగా అందించే స్వీట్. రుచికరమైన ఈ మఖానా ఖీర్ రెసిపీని తెలుసుకుందాం.
ఏకాదశి రోజున అన్నం తినడం నిషిద్ధం. అందుకే మఖానా ఖీర్ ను తయారు చేసి శ్రీ హరివిష్ణువుకి నైవేద్యంగా పెట్టవచ్చు. దానిని మీరు కూడా తినవచ్చు. మఖానా ఖీర్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఏకాదశి తిధి కార్తీక మాసంలో పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశి తిథిన పుట్టిందని నమ్మకం. అందుకనే ఈ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి కూడా ప్రత్యేకమైనది. శీతాకాలం ప్రారంభం కావడంతో కాలానుగుణ పండ్లు,కూరగాయలు కూడా రావడం ప్రారంభమవుతాయి. వీటిని విష్ణువుకు సమర్పిస్తారు. అంతేకాదు అన్నం లేకుండా స్వీట్లు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. కనుక ఈ రోజు సగ్గుబియ్యం మఖానా ఖీర్ రెసిపీని తెలుసుకుందాం.
మఖానా ఖీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
- పాలు- ఒక లీటర్
- మఖానా – ఒక కప్పు
- సగ్గుబియ్యం- పావు కప్పు
- బాదం
- పిస్తా
- జీడిపప్పు
- కుంకుమపువ్వు రేకులు కొంచెం
- చక్కెర
- యాలకుల పొడి
మఖానా ఖీర్ తయారు చేసే విధానం:
ముందుగా సగ్గుబియ్యం నీటిలో రెండు సార్లు కడిగి.. తర్వాత వాటిని ఒక మూడు గంటల పాటు నానబెట్టండి. తర్వాత మందపాటి అడుగు ఉన్న ఓ పాన్ తీసి గ్యాస్ స్టవ్ మీద పెట్టి అందులో పాలు పోసి స్విమ్ మీద వేడి చేయండి. తర్వాత పాలల్లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించండి. మరో గ్యాస్ స్టవ్ పై బాణలి పెట్టి అందులో ఒక టీస్పూన్ దేశీ నెయ్యి వేసి బాదం, జీడిపప్పు, పిస్తాలను వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే బాణలిలో రెండు చెంచాల దేశీ నెయ్యి వేసి మఖానాను బాగా వేయించాలి. ఇప్పుడు రెండు చెంచాల పాలను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కుంకుమపువ్వు రేకులు నానబెట్టండి.
ఇప్పుడు వేయించిన మఖానాలోని కొన్నిటిని వేరుగా పెట్టి.. మిగలిన మఖానాను మిక్సి లో వేసి పొడి చేయండి. ఇప్పుడు ఈ మఖానా పొడిని .. కాగుతున్న సగ్గుబియ్యం పాలల్లో వేసి బాగా కలపండి. ఇప్పుడు పాలల్లో .. మఖానా పొడి ఉడుకుతూ చిక్క బడుతుంది. ఇప్పుడు అందులో పంచదార వేసి కలిపి.. అనంతరం కొంచెం నెయ్యి.. మిగిలిన మఖానా ను వేయించిన బాదం, పిస్తా, జీడిపప్పు వేసి కలపండి. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఆ ఖీర్ లో పాలల్లో నానబెట్టిన కుంకుమపువ్వు రేకులు వేసి కలిపి మూడు, నాలుగు నిమిషాలు పాటు ఉడికించి గ్యాస్ స్టవ్ మీద నుంచి దిపెయ్యండి. అంటే టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం మఖానా ఖీర్ రెడీ. దీనిని లక్ష్మీదేవికి, విష్ణువుకు ఎక్కువగా నైవేద్యంగా సమర్పిస్తారు. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..