మీ కిడ్నీలు కలకాలం బాగుండాలంటే.. ఈ పదార్థాలను తినకపోవడమే బెటర్.. అవేంటో తెలుసా..

మన శరీరంలో ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు ఒకటి.. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.. కిడ్నీ వ్యాధి కారణంగా శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.. అటువంటి పరిస్థితిలో, మీరు ఉపశమనం పొందాలంటే, మీరు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.. దీంతో కిడ్నీలను కాపాడుకోవచ్చు..

మీ కిడ్నీలు కలకాలం బాగుండాలంటే.. ఈ పదార్థాలను తినకపోవడమే బెటర్.. అవేంటో తెలుసా..
Kidney Health
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 16, 2024 | 2:32 PM

మన శరీరంలో ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు ఒకటి.. అందుకే.. కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.. ప్రస్తుత కాలంలో చాలామంది మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. కిడ్నీ వ్యాధి అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక వైద్య పరిస్థితి.. అయినప్పటికీ, జీవనశైలి – ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేయడం ద్వారా మీరు కిడ్నీ వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మూత్రపిండాలు మన శరీరం ముఖ్యమైన వడపోత ప్రక్రియలను నిర్వహిస్తాయి. మీరు ఈ అవయవానికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతుంటే.. కొన్ని పదార్థాలు తినడం మానుకోవాలి.. లేకపోతే కిడ్నీ వ్యాధుల సమస్య మరింత పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎలాంటి పదార్థాలను తినకూడదో తెలుసుకోండి..

కిడ్నీ వ్యాధి కారణంగా శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే, మీరు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.. దీంతో కిడ్నీలను కాపాడుకోవచ్చు..

కిడ్నీ రోగులు ఈ పదార్థాలకు దూరంగా ఉండటమే బెటర్..

అధిక-పొటాషియం ఆహారాలు: పొటాషియం ఒక ముఖ్యమైన ఖనిజం.. ఇది నరాలు – కండరాల కణాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు అదనపు పొటాషియం హానికరం. మీరు అరటి, నారింజ, బంగాళాదుంప వంటి వాటి వినియోగాన్ని తగ్గించాలి.

మితిమీరిన సోడియం: మనం ఉప్పు ద్వారా చాలా సోడియం పొందుతాం.. వాస్తవానికి, వైద్య నిపుణుల ప్రకారం.. ఒకవ్యక్తి రోజులో 4 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. ఎందుకంటే ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు, ఇది విషం కంటే తక్కువ కాదు. మీరు ఫ్రైస్, సాల్ట్ చిప్స్, ఫాస్ట్ ఫుడ్, అన్ని రకాల ఉప్పు పదార్థాలకు దూరంగా ఉండాలి.

రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాలు: రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. శరీరంలో వ్యర్థ పదార్థాలను పేరుకుపోవడానికి సహాయపడుతుంది. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. ఇది కిడ్నీ రోగుల సమస్యలను పెంచుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మటన్, గొడ్డు మాంసం, పంది మాంసం తినకుండా ఉండాలి.

కెఫిన్: భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తమ రోజును ఒక కప్పు టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. ఇది మీకు కొంతకాలం తాజాదనాన్ని అందించినప్పటికీ.. దీర్ఘకాలంలో ఇది మూత్రపిండాలకు హాని చేస్తుంది. మీరు కిడ్నీ వ్యాధిగ్రస్తులైతే దీనిని తాగకపోవడమే మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి