ఓర్నాయనో.. జామపండు తినడం వారికి మంచిది కాదంట.. మీకు ఈ 6 సమస్యలుంటే డేంజరే..

జామపండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇది తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.. అయితే.. కొన్ని సమస్యలు ఉన్న వారు ఈ రుచికరమైన జామపండును తినకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కడుపు నొప్పి, అలర్జీలు - స్కిన్ ఇరిటేషన్ లాంటివి ఎదుర్కొవలసి ఉంటుందని పేర్కొంటున్నారు.

ఓర్నాయనో.. జామపండు తినడం వారికి మంచిది కాదంట.. మీకు ఈ 6 సమస్యలుంటే డేంజరే..
Guava
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 16, 2024 | 11:56 AM

జామపండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. జామను ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనదిగా పరిగణిస్తారు.. ఈ రుచికరమైన జామపండు తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.. చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. శీతాకాలంలో ఎక్కువగా లభించే జామపండు ఆరోగ్యానికి మంచిదే కానీ.. కొందరికీ.. హాని కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో, జామ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని.. ఇది మీ సమస్యలను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువగా జామపండు తినకూడదో ఇప్పుడు తెలుసుకోండి..

ఈ ఆరు సమస్యలు ఉన్న వారు జామపండు తినకూడదు.

  1. పొట్టలో అసిడిటీ సమస్య: మీకు కడుపులో ఆమ్లత్వం లేదా గ్యాస్ సమస్య ఉంటే మీరు జామపండుకు దూరంగా ఉండాలి. జామపండులో ఉండే యాసిడ్, ఫైబర్ కడుపులో ఎసిడిటీని పెంచి, మంటను, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా దీన్ని ఖాళీ కడుపుతో తినడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
  2. కడుపు నొప్పి, విరేచనాలు – మలబద్ధకం : జామలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది.. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే దీని గింజలను నమిలి తింటే మలబద్ధకం సమస్య పెరుగుతుంది. జామ గింజలు పేగులకు అంటుకుని జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తాయని పేర్కొంటున్నారు. జామపండు ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు లేదా మలబద్ధకం ఏర్పడవచ్చు. సున్నితమైన కడుపు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంటున్నారు.
  3. కిడ్నీ వ్యాధిగ్రస్తులు: కిడ్నీ సంబంధిత సమస్యల విషయంలో జామ తీసుకోవడం తగ్గించాలి. జామపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. కిడ్నీ రోగులు వారి వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తినాలని సూచిస్తున్నారు.
  4. డయాబెటిక్ పేషెంట్లు: జామపండులోని తీపి సహజమే, కానీ దాని అధిక వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి.. అంతేకాకుండా.. వారి చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి.
  5. అలర్జీలు – స్కిన్ ఇరిటేషన్ : కొంతమందికి జామపండులోని రసాయనాల వల్ల అలర్జీ రావచ్చు. జామపండు చర్మపు చికాకును కూడా కలిగిస్తుంది లేదా తామరను మరింత తీవ్రతరం చేస్తుంది.
  6. జలుబు – దగ్గు: జామకు చలువ చేసే గుణం ఉంది.. దీనిని తింటే జలుబు – దగ్గు సమస్య పెరుగుతుంది. తేలికగా జలుబు ఉన్న వారు జామపండ్లను తినకూడదు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి