AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: జీవితంలో విబేధాలు రాకుండా ఉండాలంటే.. పెళ్ళికి ముందు ఈ విషయాలు తెలుసుకోమంటున్న చాణక్య..

ఆచార్య చాణుక్యుడు మానవ జీవితం నడవడిక గురించి మాత్రమే కాదు మానవ బంధాల గురించి కూడా నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలంటే .. పెళ్ళికి ముందే అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. పెళ్లికి ముందు కాబోయే భాగస్వామిని తప్పనిసరిగా మూడు ప్రశ్నలు అడగాలని ఆచార్య చాణుక్యుడు చెప్పాడు.

Chanakya Niti: జీవితంలో విబేధాలు రాకుండా ఉండాలంటే.. పెళ్ళికి ముందు ఈ విషయాలు తెలుసుకోమంటున్న చాణక్య..
Chanakya Niti
Surya Kala
|

Updated on: Nov 16, 2024 | 3:23 PM

Share

జీవితం సరైన మార్గంలో ప్రయాణం చేయడం.. జీవన మార్గం సుగమం చేసుకోవడం కోసం చాణక్య నీతి పాటించడం ఒక్కటే దారి అని పెద్దలు చెబుతారు. అందుకే జీవితంలో అతి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు చాణక్య నీతి గురించి ఈ 3 విషయాలు తెలుసుకోవడం మంచిది. చాణక్య సూత్రాలు పాటిస్తే జీవితంలో పురోగమనం ఉంటుంది. చాణక్యుడు చెప్పిన ఈ 3 విషయాలు జీవితంలో పాటించడం వలన వైవాహిక జీవితం సంతోషంగా గడపడానికి ఉపయోగపడతాయి. ప్రస్తుతం ప్రపంచంలో దాంపత్య జీవితంలో విబేధాలు తరచుగా చోటు చేసుకుంటూ.. విడాకుల వరకూ వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో వైవాహిక జీవితం సంతోషంగా ఉండేందుకు చాణక్యుడు చాలా విషయాలు చెప్పాడు. వీటిని పాటిస్తే వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది.

రిలేషన్‌షిప్‌లో ఏ చిన్నపాటి చీలిక వచ్చినా ఎక్కువ కాలం సంబంధాన్ని కొనసాగించడం చాలా కష్టం. వైవాహిక సంబంధాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ సంబంధం మాధుర్యాన్ని కొనసాగించడానికి అనేక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు తెలుసుకోవటానికి సమయం పడుతుంది. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు భార్యాభర్తలుగా మారి తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడానికి చిన్న చిన్న త్యాగాలు చేయాలి. వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి చాణక్యుడు అనేక పరిష్కారాలను కూడా సూచించాడు. అందుకే పెళ్లి తర్వాత కంటే పెళ్ళికి ముందు జీవిత భాగస్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని వెల్లడించాడు.

చాణక్యుడు ప్రకారం వైవాహిక జీవితంలో విబేధాలు రావడం మొదలు పెడితే అది కొనసాగుతూనే ఉంటుంది. అయితే అసలు భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు రాకుండా ముందు జాగ్రత్తగా పెళ్ళికి ముందే కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలని సూచించాడు. పెళ్లికి ముందు కాబోయే భాగస్వామిని తప్పనిసరిగా మూడు ప్రశ్నలు అడగాలని చెప్పాడు. దీని వలన వివాహానంతరం పవిత్రమైన భార్య భర్తల సంబంధంపై ఏ విధంగానూ ప్రభావం చూపించదన్నాడు.

ఇవి కూడా చదవండి

వయస్సు గురించి తెలుసుకోండి..

ఆచార్య చాణక్యుడి విధానం ప్రకారం వివాహానికి ముందుకాబోయే భాగస్వామి వయస్సును ఒకరికొకరు ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. నిజానికి భార్యాభర్తల మధ్య వయోభేదం ఎక్కువగా ఉంటే విబేధాలు వచ్చే అవకాశం ఎక్కువ. భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవడమే వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడానికి ఒక కారణం మని పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య అవగాహన లేకపోతే గొడవలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల భార్యాభర్తల మధ్య వయస్సు వ్యత్యాసం ఎక్కువగా ఉండకూడదు. అప్పుడు వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది.

ఆరోగ్యం గురించి సమాచారం

ఆచార్య చాణక్యుడి విధానంలో వివాహానికి ముందు తన కాబోయే భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని తెలుసుకోవాలి. శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు లేవని, భవిష్యత్తులో ఇద్దరూ ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేయాలని చెప్పాడు.

పెళ్ళికి ముందు పాత సంబంధాలు

ఆచార్య చాణక్యుడు వివాహానికి ముందు జీవిత భాగస్వామికి సంబంధించిన మునుపటి సంబంధాల గురించి ఒకరికొకరు తెలుసుకోవాలని.. ఎటువంటి దాపరికం లేకుండా చెప్పాలని చాణుక్యుడు చెప్పాడు. ఇలా పెళ్ళికి ముందు ఉన్న సంబంధం గురించి రహస్యంగా ఉంచకుండా చెప్పడం వలన వైవాహిక జీవితంలో భవిష్యత్ ఎటువంటి విబేధాలు రావని.. ఆహ్లాదకరంగా సాగుతుందని వెల్లడించాడు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి