Shukra Gochar: డిసెంబర్‌లో రెండు సార్లు రాశులను మార్చుకోనున్న శుక్రుడు.. ఈ 4 రాశులపై సంపదల వర్షం..

నవ గ్రహాల్లో సూర్యుడి తర్వాత పెద్ద గ్రహం శుక్రుడు.. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కూడా.. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడుని శుభాగ్రహంగా పరిగణిస్తారు. సంపద శ్రేయస్సునిచ్చే శుక్ర గ్రహం డిసెంబర్ నెలలో రాశిని మార్చుకోబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి పురోభివృద్ధి, ఆర్థిక లాభ అధికంగా ఉంటాయి. ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.

Shukra Gochar: డిసెంబర్‌లో రెండు సార్లు రాశులను మార్చుకోనున్న శుక్రుడు.. ఈ 4 రాశులపై సంపదల వర్షం..
Shukra Gochar 2024
Follow us
Surya Kala

|

Updated on: Nov 16, 2024 | 2:50 PM

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. ఈ గ్రహ సంచారం వలన ప్రజల జీవితాలు ప్రభావితం అవుతాయి. ఈసారిలో చివరి నెల డిసెంబరు నెలలో సుఖసంతోషాలను, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు తన రాశిని రెండుసార్లు మార్చుకోనున్నాడు. ఇందులో ఒకసారి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు.. రెండవసారి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా శుభాలను ఇచ్చే శుక్రుడు రాశిని మార్చుకోవడం వలన కొన్ని రాశులకు అదృష్టం వరిస్తుందట.

శుక్ర సంచారం ఎప్పుడంటే

వేద క్యాలెండర్ ప్రకారం శుక్రుడు తన రాశిని డిసెంబర్‌లో రెండుసార్లు మార్చుకోనున్నాడు. తొలిసారిగా శుక్రుడు డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12:05 గంటలకు మకరరాశిలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత డిసెంబర్ 28న మకరరాశి నుంచి బయలుదేరి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.

శుక్ర సంచారం వలన ఏ రాశికి ప్రయోజనకరం అంటే

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు శుక్రుని సంచారము శుభఫలితాలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో వృషభ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. అంతేకాదు వృత్తి, వ్యాపారాలలో కూడా పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలంగా, స్థిరంగా ఉండవచ్చు. అంతే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తులా రాశి: శుక్రుని సంచారం తులారాశి ప్రజల జీవితాలపై చాలా సానుకూల ప్రభావం చూపుతుంది. పని చేసే వారికి పదోన్నతి లభిస్తుంది. వ్యాపారం చేసే వారు డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది.

మకర రాశి: శుక్రుని సంచారం మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ముందుగా శుక్రుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మకర రాశికి చెందిన వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనిని కష్టపడి పూర్తి చేయడం వలన సానుకూల ఫలితాలను పొందుతారు. దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది. అంతేకాదు అవివాహితులకు వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

కుంభ రాశి: శుక్రుడు రెండో సారి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. సంపదలను ఇచ్చే శుక్రుడు మకర రాశి నుంచి రెండోసారి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా శుక్రుని సంచారం కూడా ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు ఆఫీసులో గౌరవం కూడా పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే