Vipreet Raj Yoga: కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఆ రాశుల వారికి విపరీత రాజయోగం..!

Telugu Astrology: జ్యోతిష శాస్త్రంలో విపరీత రాజయోగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ రాజయోగం లేనిదే అధికారం చేపట్టలేమని, అందలాలు ఎక్కలేమని, సంపద వృద్ధి చెందదని జ్యోతిష శాస్త్రంలో అనేక సూత్రాలు చెబుతున్నాయి.జాతకంలో గానీ, గ్రహచారంలో గానీ 6, 8, 12 స్థానాల అధిపతులు ఒకరి రాశిలో మరొకరున్నా లేదా ఎవరి రాశుల్లో వారున్నా విపరీత రాజయోగం పడుతుంది.

Vipreet Raj Yoga: కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఆ రాశుల వారికి విపరీత రాజయోగం..!
Vipareet Rajayoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 15, 2024 | 7:39 PM

జ్యోతిష శాస్త్రంలో విపరీత రాజయోగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ రాజయోగం లేనిదే అధికారం చేపట్టలేమని, అందలాలు ఎక్కలేమని, సంపద వృద్ధి చెందదని జ్యోతిష శాస్త్రంలో అనేక సూత్రాలు చెబుతున్నాయి. అయితే, ఈ నెల ఏకంగా ఏడు రాశులకు ఈ విపరీత రాజయోగం కలుగుతోంది. అవిః మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశులు. జాతకంలో గానీ, గ్రహచారంలో గానీ 6, 8, 12 స్థానాల అధిపతులు ఒకరి రాశిలో మరొకరున్నా లేదా ఎవరి రాశుల్లో వారున్నా విపరీత రాజయోగం పడుతుంది. ఈ విపరీత రాజయోగం వల్ల ప్రధానంగా అధికార యోగం పడుతుంది. సంపద బాగా వృద్ధి చెందుతుంది. సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది.

  1. మేషం: ఈ రాశికి ఆరవ స్థానాధిపతి బుధుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నందువల్ల విపరీత రాజయోగం ఏర్పడింది. వీరు జనవరి 4వ తేదీ లోపు తప్పకుండా ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు చాలావరకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి.
  2. వృషభం: ఈ రాశికి 6వ స్థానాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. దీని ఫలితంగా ఈ రాశివారు డిసెంబర్ 2వ తేదీ లోపు ఉద్యోగంలో పదో న్నతి సాధించే అవకాశం ఉంది. సంపద అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో వైభవంగా శుభ కార్యాలు నిర్వహిస్తారు. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశివారికి అష్టమాధిపతి అష్టమ స్థానంలోనే ఉన్నందువల్ల విపరీత రాజయోగం ఏర్పడింది. దీనివల్ల శీఘ్రగతిన పదోన్నతులు లభించే అవకాశం ఉంది. జనవరి 20 లోపు ఈ రాశివారికి తప్పకుండా వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడంతో పాటు కీలకమైన శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో భాగం ఇతర దేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది.
  4. కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి ఆరవ స్థానంలోనే ఉన్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల ఆదాయం బాగా పెరగడంతో పాటు ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. మార్చి 29 లోపు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడం లేదా పదోన్నతులు కలగడం తప్పకుండా జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.
  5. తుల: ఈ రాశికి ఆరవ స్థానాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల విపరీత రాజయోగం ఏర్పడింది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వచ్చే ఏడాది మే 25లోపు ఉద్యోగంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. సంపద బాగా వృద్ధి చెందుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు లభిస్తాయి.
  6. ధనుస్సు: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉండడం వల్ల విపరీత రాజయోగం పట్టింది. దీనివల్ల నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు అంది వస్తాయి. జన వరి 20 లోపు వీరి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహిం చని పదోన్నతులు కలుగుతాయి. విదేశాలకు వెళ్లవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అనుకో కుండా భూ లాభం కలుగుతుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు.
  7. మీనం: ఈ రాశికి 12వ స్థానాధిపతి 12వ స్థానంలోనే ఉన్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. రాజ పూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. మార్చి 29 లోపు వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా హోదాలు, స్థాయి పెరిగే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో సంపద పెరుగు తుంది. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది. విదేశాల్లో స్థిరపడడం కూడా జరుగుతుంది.