AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun Transit: శనివారం వృశ్చికరాశిలో అడుగు పెట్టనున్న సూర్యుడు.. ఈ రాశికి చెందిన వ్యక్తులకు అన్నీ కష్టాలు, నష్టాలే.. జాగ్రత్త సుమా..

గ్రహాలకధిపతి సూర్యుడు రేపు (శనివారం తన రాశిని మర్చుకోనున్నాడు. వృశ్చికరాశిలో సూర్యుడు ప్రవేశించి ఇక్కడ నెల రోజుల పాటు సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండనుంది. వృత్తిలో పురోగతి, వ్యాపారంలో లాభాలు, వ్యక్తిగత జీవితంలో సంతోషాలు లోపించవచ్చు. అంతేకాదు ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

Sun Transit: శనివారం వృశ్చికరాశిలో అడుగు పెట్టనున్న సూర్యుడు.. ఈ రాశికి చెందిన వ్యక్తులకు అన్నీ కష్టాలు, నష్టాలే.. జాగ్రత్త సుమా..
Sun Transit In Scorpio
Surya Kala
|

Updated on: Nov 15, 2024 | 10:56 AM

Share

గ్రహాల రాజు సూర్యుడు నవంబర్ 16వ తేదీ శనివారం రోజున వృశ్చికరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సూర్య సంచారముతో కొన్ని రాశులకు చెడ్డ రోజులు మొదలవుతాయి. అదే సమయంలో కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది. ఈ సూర్య సంచారంతో పాటు, శనీశ్వరుడు, సూర్యుడిని ప్రత్యక్షంగా కలవనున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ సూర్యుడి మార్పు అనేక రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిషశాస్త్రంలో తండ్రి కొడుకు అయిన సూర్యుడు, శనీశ్వరుడు మధ్య సంబంధం శుభప్రదంగా పరిగణించబడదు. అందుకే ఈ సమయం కొన్ని రాశికి చెందిన వ్యక్తులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపించి కొంత ఇబ్బందికర పరిస్థితులను కలిగిస్తుంది. దీంతో రేపు సూర్య సంచారము వలన అనేక రాశుల వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. పంచాంగం ప్రకారం నవంబర్ 16, 2024 ఉదయం 7:32 గంటలకు సూర్యుడు వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నేపధ్యంలో రేపటి నుంచి నెల రోజు పాటు కొన్ని రాశుల వారు అనేక కష్టాలు, నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాం..

వృషభ రాశి: వృశ్చిక రాశిలో సూర్యుడు సంచరించడం వల్ల వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆరోగ్యంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వివాహితులకు ఈ సమయం ఒత్తిడిని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆఫీసులో అధికారులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఈ రాశికి చెందిన వ్యక్తులు సుదీర్ఘ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తుంటే.. పెద్దగా ప్రయోజనం కలిగించదు.. కనుక ప్రయాణాన్ని వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. సంబంధం చెడిపోకుండా మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి.

మేషరాశి: వృశ్చిక రాశిలో సూర్యుడు సంచరించడం వల్ల మేష రాశి వారు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబంలో కొంత ఒత్తిడితో నెలకొంటుంది. అన్నదమ్ముల మధ్య ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరగవచ్చు. ఇంట్లో విభేదాలు పెరగవచ్చు. అంతేకాదు ఈ రాశికి చెందిన వ్యక్తులు వాహనాలను జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంది. ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. కొంచెం వేచి ఉండండి. ఎందుకంటే ఇది పెట్టుబడికి అనుకూలమైన సమయం కాదు. జీవిత భాగస్వామితో సంబంధంలో కూడా విభేదాలు ఏర్పడవచ్చు.

ఇవి కూడా చదవండి

కుంభ రాశి: వృశ్చికరాశిలో సూర్యభగవానుడు సంచరిస్తున్నందున కుంభ రాశి వారు ఈ సమయంలో ఆస్తికి సంబంధించిన 4విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. భూమి లేదా ఆస్తికి సంబంధించిన వివాదంలో చిక్కుకోవచ్చు. ప్రభుత్వ పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడవచ్చు, కొంత నిరాశ కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారవచ్చు. వ్యాపారస్తులు ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.. అయినా ఈ ప్రయాణాల వలన పెద్దగా ప్రయోజనం పొందలేరు. ఈ సమయంలో ప్రతి విషయంలో పరుగులు పెట్టాల్సి ఉంటుంది. అది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. ఈ సమయంలో కొన్ని విషయాల పట్ల నిర్ణయాలు.. ఓపికతో.. తెలివిగా తీసుకోండి.

సింహ రాశి: శనివారం నుంచి సూర్యుని సంచార ప్రభావం సింహ రాశి వారిపై కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పెరగవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగస్తులపై పని ఒత్తిడి పెరుగుతుంది. వీరు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీ బాస్ లేదా సీనియర్‌లతో కూడా జాగ్రత్తగా ప్రవర్తించండి. కోపాన్ని నియంత్రించుకోండి లేకుంటే అది హానికరం.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.