AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Pournami: కార్తీక పౌర్ణమికి నదీ స్నానాలకు పోటెత్తిన భక్తులు.. శివాలయాల్లో భక్తుల రద్దీ..

ఈ రోజు తెలుగు కార్తీక పౌర్ణమి. దీంతో తెలుగు రాష్ట్రాలలో కార్తీక పున్నమి శోభ నెలకొంది. నదీ స్నానం చేసి దీప దానం ఇవ్వడానికి భక్తులు పోటెత్తారు. అంతేకాదు శివయ్యను దర్శించుకుని అభిషేకం చేసి ఆలయంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడానికి భక్తులు ఆలయాల్లో బారులు తీరారు.

Karthika Pournami: కార్తీక పౌర్ణమికి నదీ స్నానాలకు పోటెత్తిన భక్తులు.. శివాలయాల్లో భక్తుల రద్దీ..
Kartika Pournami
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Nov 15, 2024 | 10:20 AM

Share

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక శోభన సంతరించుకుంది, తెల్లవారుజాము నుంచే గోదావరి స్నానాలకు, శివాలయాలకు పోటెత్తారు భక్తులు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి పుణ్యస్నానా కోసం జల్లు స్నానాలను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి గా పిలవబడే కార్తీకమాసంలో శుక్లపక్షంలో పున్నమి తిధి దీపావళి పండగ వెళ్ళిన 15వ రోజు వస్తుంది. హిందువులు అత్యంత పరమ పవిత్రమైన కార్తీక మాసంలోని పౌర్ణమి తిధి కావడంతో శివాలయాలకు , సవక్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం పాదగయ, కోనసీమలో పలు పుణ్యక్షేత్రాలకు చేరుకుని పెద్ద ఎత్తున దీపాలు వెలిగిస్తున్నారు, మహాభారత కథనాన్ని అనుసరించి కార్తీకేయుడు తారకరుని సంహరించిన రోజునే కార్తీక పౌర్ణంగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి.

మహాశివరాత్రి తర్వాత శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా కార్తీకమాసం అంటున్నారు పండితులు. కార్తీక పౌర్ణమి రోజున చేసే నదీ స్నానం దీప దానం, శివాయల దర్శనం, విశేష పూజలు చేస్తే ఎంతో పుణ్యం ఫలమని నమ్మకం. ఈ నెల అంతా కార్తీక మహా పురాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాలో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తే ఎంతో పుణ్యఫలం అని బ్రాహ్మణులు చెబుతున్నారు, వెయ్యిళ్ల రాక్షసుల పాలన అంతరించిన సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే కార్తీక పౌర్ణమి రోజు గోదావరి స్నానం నదీ స్నానమాచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేయడానికి ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. శివాలయంలో 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం. దీంతో గోదావరి జిల్లాల్లోని ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..