Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adhikara Yoga: అధికార గ్రహ బలం.. ఈ ఏడాది ఆ రాశుల వారికి ఉన్నత పదవులు పక్కా..!

ఈ ఏడాది ఏయే రాశుల వారిని ఉన్నత పదవులు వరించబోతున్నాయి? ఈ ఏడాది గ్రహ సంచారంలో జరిగే మార్పులను బట్టి ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా కొన్ని రాశుల వారు ఉన్నత పదవులను, ఉన్నత స్థానాలను, ఉన్నత స్థాయిని పొందే అవకాశం ఉంది.

Adhikara Yoga: అధికార గ్రహ బలం.. ఈ ఏడాది ఆ రాశుల వారికి ఉన్నత పదవులు పక్కా..!
Adhikara YogaImage Credit source: Getty Images
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 14, 2024 | 7:15 PM

ఈ ఏడాది ఏయే రాశుల వారిని ఉన్నత పదవులు వరించబోతున్నాయి? ఈ ఏడాది గ్రహ సంచారంలో జరిగే మార్పులను బట్టి ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా కొన్ని రాశుల వారు ఉన్నత పదవులను, ఉన్నత స్థానాలను, ఉన్నత స్థాయిని పొందే అవకాశం ఉంది. అవిః మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశులు. ఈ రాశుల సహజ స్వభావాలతో పాటు, గురు, కుజ, రవుల వంటి అధికార గ్రహాల బలం కూడా తోడవడంతో ఈ రాశుల వారు తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశివారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ధైర్యం, సాహసం, తెగువ, ఆత్మ విశ్వాసం, నిర్ణయాత్మకత వంటి అంశాల్లో వీరు అగ్రస్థానంలో ఉంటారు. సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ ఏడాది వీరిలోని ఈ లక్షణాలు వెలుగులోకి రాబోతున్నాయి. వీరికి రాశ్య ధిపతి కుజుడితో పాటు, గురు, రవులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు ఈ నెల 15వ తేదీ తర్వాత ఉన్నత పదవులు అలంకరించే అవకాశం ఉంది. సామాజిక స్థాయి పెరుగుతుంది.
  2. సింహం: ఈ రాశివారిలో జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. సృజనాత్మకంగా వ్యవహరిస్తారు. వీరి మీద వీరికి నమ్మకం బాగా ఎక్కువగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలకు లోటు లేనందువల్ల ఎక్కడ ఏ సంస్థలో ఉన్నా రాణిస్తారు. ఈ నెల రెండవ వారం నుంచి వీరి దశ తిరిగే అవకాశం ఉంది. రాశ్యధి పతి రవి, గురు, కుజుల అనుకూలత వల్ల వీరు తప్పకుండా ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరు కునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు. ప్రముఖుల స్థాయికి చేరుకుంటారు.
  3. తుల: వ్యాపారాలు చేయడంలో, వ్యాపారాత్మకంగా వ్యవహరించడంలో వీరు సిద్ధహస్తులు. ప్రయోగాలు చేయడానికి కూడా వెనుకాడరు. ప్రతి పనినీ ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. కష్టపడే మన స్తత్వం, సాధించాలన్న పట్టుదల వీరిలో ఎక్కువగా ఉన్నందువల్ల ఈ నెల ద్వితీయార్థంలో వీరు ఒక సంస్థకు సారథ్యం వహించే అవకాశం ఉంది. రవి, కుజులు కూడా బాగా అనుకూలంగా ఉన్నం దువల్ల వీరు వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది.
  4. వృశ్చికం: వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంలో దిట్టలైన ఈ రాశివారు సాధారణంగా తమ నిర్ణయాలను ఒక పట్టాన మార్చుకోరు. లక్ష్యసాధన కోసం కృషి చేయడంలో వీరికి వీరే సాటి. క్రమ శిక్షణకు, పట్టుదలకు మారుపేరైన ఈ రాశివారు కుజ, రవి, గురువుల అనుకూలత వల్ల అతి త్వరలో తాము అనుకున్నవన్నీ సాధించడం జరుగుతుంది. ఏ రంగంలో ఉన్నా వీరు ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడే అవకాశముంది.
  5. ధనుస్సు: ఉన్నత స్థాయి ఆశయాలు, భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు అహర్నిశలూ కృషి చేసే లక్షణమున్న ఈ రాశివారు ప్రణాళికలను రూపొందించడంలో వీరిని మించిన వారుండరు. వీరికి ప్రస్తుతం రాశ్యధిపతి గురువుతో పాటు రవి, కుజులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల అతి త్వరలో వీరికి వృత్తి, ఉద్యోగాలపరంగా దశ తిరిగే అవకాశం ఉంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
  6. మకరం: ఈ రాశివారు పట్టుబట్టారంటే సాధించుకునే వరకూ విడిచిపెట్టరు. ఎంత శ్రమకైనా వెనుకాడరు. ప్రణాళికాబద్ధంగా, ఆచరణాత్మకంగా, క్రమశిక్షణగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఈ ఏడా దంతా వీరికి కుజ, గురు, రవులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరిలోని ఈ లక్షణాలన్నీ ఉన్నత పదవులు చేపట్టడానికి ఉపకరిస్తాయి. ఈ నెల ద్వితీయార్థం నుంచి వీరికి శీఘ్ర పురోగతి ప్రారంభం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా వీరి స్థాయి పెరుగుతుంది.